డబుల్ ఇంజన్ సర్కార్ తోనే తెలంగాణ సమగ్ర అభివృద్ధి

తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే సమగ్ర అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఈ ఎన్నికలలో బిజెపికి ఓటు వేసి గెలిపించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కోరారు. శనివారం స్థానిక మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో జరిగిన విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కెసిఆర్ అవినీతి అక్రమాల ప్రభుత్వాన్ని కూల్చివేయాలన్నారు.

డబుల్ ఇంజన్ సర్కార్ తోనే తెలంగాణ సమగ్ర అభివృద్ధి

తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు ఇవి

అధికారంలోకి రాగానే కెసిఆర్ అవినీతి.,కుంభకోణాలపై , దర్యాప్తు

కేంద్ర హోం మంత్రి అమిత్ షా 

నల్గొండ, మనసాక్షి:

తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే సమగ్ర అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఈ ఎన్నికలలో బిజెపికి ఓటు వేసి గెలిపించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కోరారు. శనివారం స్థానిక మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో జరిగిన విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కెసిఆర్ అవినీతి అక్రమాల ప్రభుత్వాన్ని కూల్చివేయాలన్నారు.

కేసీఆర్ గతంలో అనేక హామీలు ఇచ్చి మోసం చేసి మళ్లీ ఓట్ల కోసం వస్తున్నాడని విమర్శించారు .బ్రాహ్మణ వెల్లంల ,శివన్న గూడెం, ఉదయ సముద్రం, ప్రాజెక్టులను ఇంతవరకు పూర్తి చేయలేదన్నారు. నల్గొండ స్మార్ట్ సిటీ కోసం 400 కోట్ల రూపాయలు ఇస్తే కేసీఆర్ అవినీతికి పాల్పడ్డాడని ప్రజాధనాన్ని దోపిడీ చేశాడని విమర్శించారు .

దళిత బంధు పేరుమీద టిఆర్ఎస్ కార్యకర్తలు లక్ష నుండి మూడు లక్షల రూపాయలు కమిషన్ తీసుకున్నారన్నారు. అధికారంలోకి వస్తే బీసీ నీ ముఖ్యమంత్రి చేస్తామని మోడీ ప్రకటించారనీ ప్రధానమంత్రి మోడీ ప్రభుత్వం లో ఓబీసీలు గౌరవంగా బతుకుతున్నారని వారికి సముచిత స్థానం ఇచ్చింది బిజెపి అన్నారు .

ALSO READ : నిరుద్యోగలను మోసం చేసిన సీఎం కేసీఆర్,,!

బీసీ లకు ఎంబిబిఎస్ నీట్ కోర్సులలో రిజర్వేషన్ శాతం పెంచామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంఐఎంతో జత కలిసి వారిని బుజ్జగిస్తూ వారి కోసమే పథకాలు ప్రవేశపెడుతూ రెండవ అధికార భాషను ఉర్దుగా వారి మెప్పు కోసం పెట్టారన్నారు . బిజెపి అధికారంలోకి రాగానే మతపరమైన రిజర్వేషన్ తొలగిస్తామన్నారు హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు.

టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు రెండు కుటుంబ పార్టీలని కేసీఆర్ తన కొడుకుని ముఖ్యమంత్రి చేయడానికి సోనియా గాంధీ తన కొడుకుని ప్రధానమంత్రి నీ చేయడానికి కుట్రలు చేస్తున్నారన్నారు .టిఆర్ఎస్ అవినీతి పార్టీ అని లంచగొండి పార్టీ అని మిషన్ భగీరథ స్కీంకు 22 వేల కోట్లు ఇస్తే అవినీతి చేశారన్నారు .మియాపూర్ భూ కుంభకోణం కాలేశ్వరం ప్రాజెక్టులలోఅవినీతి తోపాటు బి ఆర్ఎస్ పార్టీ అనేక కుంభ కోణాలకు పాల్పడిందన్నారు.

ALSO READ : 39 wives in one place : 39 మంది భార్యలు.. ఒకేచోట కాపురం, కుటుంబ సభ్యులు ఎంతమంది అంటే..!

కేసీఆర్ కు రోజులు దగ్గర పడ్డాయని, బిజెపి అధికారంలోకి రాగానే ఆయన అవినీతి, కుంభకోణాలపై దర్యాప్తు జరిపి జైలుకు పంపిస్తామన్నారు 22 జనవరిన అయోధ్యలోని రామ మందిరంలో రామ్ లీలా విగ్రహాల ప్రతిష్టాపనలో,మోడీ పాల్గొంటున్నారని ,కాంగ్రెస్ పార్టీ రామ మందిర విగ్రహ నిర్మాణానికి అనేక ఆటంకులు కల్పించిందన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే తెలంగాణలో పేదలు బడుగు బలహీనవర్గాల ప్రజలు బాగుపడతారన్నారు.

సభ లో అంతకుముందు బిజెపి జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును కుర్చీ వేసుకొని పూర్తి చేస్తానని చెప్పారని 18 నెలలలో సాగర్ ఆయకట్టు కింద లిఫ్టులని పూర్తి చేస్తామని హామీ ఇచ్చి ఒక్క హామీని కూడా నిలబెట్టలేదన్నారు.

కేసీఆర్ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు రాష్ట్రంలోని ప్రతి గ్రామపంచాయతీకి కేంద్ర ప్రభుత్వమే నేరుగా సర్పంచ్ ఖాతాలు డబ్బులు వేస్తుందని వాటితోనే సర్పంచులు గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాలు ఇస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నారన్నారు. ప్రతి పనిలో కేంద్ర ప్రభుత్వ వాటా ఉందని కెసిఆర్ గ్రామాలకు ఇచ్చింది ఏమీ లేదని విమర్శించారు .

ALSO READ : నక్కల గండి, డిండి ఎత్తిపోతల పూర్తి చేయలేని బి ఆర్ ఎస్ ను ఓడించండి.. బాలు నాయక్..!

ఐకెపి కొనుగోలు కేంద్రాలలో రైతులను రెండు మూడు నెలలుగా ఉంచుతూ కొనుగోలు చేయకపోవడంతో వారంతా నేరుగా మిల్లులకు మిల్లులకు చేరవేస్తూ తేమశా తేమ పేరుతో మోసపోతున్నారన్నారు బిజెపికి ఓటు వేస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని అన్నారు అలాగే నల్లగొండ నకిరేకల్ మునుగోడు దేవరకొండ నాగార్జునసాగర్ మిర్యాలగూడ అభ్యర్థులు మాట్లాడారు.

సమావేశంలో జాతీయ ఓబీసీ చైర్మన్ లక్ష్మణ్ నల్గొండ ఇన్చార్జి ప్రదీప్ కుమార్ బిజెపి నల్లగొండ అభ్యర్థి మాధవన్ శ్రీనివాస్ గౌడ్ ,అభ్యర్థి చెలమల కృష్ణారెడ్డి, దేవరకొండ అభ్యర్థి లాలునాయక్ , మిర్యాలగూడ అభ్యర్థి సాధినేని శ్రీనివాసరావు, నాగార్జునసాగర్ అభ్యర్థి కంకణాల నివేదిత, నకిరేకల్ నియోజకవర్గ అభ్యర్థి తో పాటు, రాష్ట్ర కేంద్ర నాయకులు చింత సాంబమూర్తి ,

గోలిమధుసూదన్ రెడ్డి, బండారు ప్రసాద్.  వీరేలు చంద్రశేఖర్, పోతపాక సాంబయ్య. నూకల నరసింహారెడ్డి. నూకల వెంకటనారాయణ రెడ్డి . పాత లింగస్వామి. ముని కుమార్. ఎర్రడ్ల శ్రీనివాసరెడ్డి , డాక్టర్ వర్షిత్ రెడ్డి .  నీరజ. కన్మంత్ రెడ్డి , శ్రీదేవి రెడ్డి . కాశమ్మ. చింత ముత్యాలరావు, యాదగిరి ఆచారి తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : మహిళలకు, రైతులకు భారీ గుడ్ న్యూస్.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో సంచలన హామీలు..!