కెసిఆర్ కుటుంబ పాలన  అంతం అందించడమే  లక్ష్యం..!

మర్రిగూడ మండల వివిధ గ్రామాలలో మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. లెంకలపల్లి. కమ్మ గూడెం. భీమనపల్లి. వట్టిపల్లి. రామ్ రెడ్డి పల్లి. సరంపేట గ్రామాలలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.

కెసిఆర్ కుటుంబ పాలన  అంతం అందించడమే  లక్ష్యం..!

మర్రిగూడ.  మన సాక్షి:

మర్రిగూడ మండల వివిధ గ్రామాలలో మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. లెంకలపల్లి. కమ్మ గూడెం. భీమనపల్లి. వట్టిపల్లి. రామ్ రెడ్డి పల్లి. సరంపేట గ్రామాలలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాక కోసం వివిధ గ్రామాలలో అభిమానులు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆటపాటలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ కుటుంబ పాలన అంతా మన్నించడమే లక్ష్యం అని, 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి 22,000 మెజార్టీతోని గెలిచి నాలుగు సంవత్సరాలు వేచి చూచిన కెసిఆర్ ఒక చిల్లి గవ్వ కూడా నాకు ఇవ్వలేదన్నారు.

ALSO READ : 39 wives in one place : 39 మంది భార్యలు.. ఒకేచోట కాపురం, కుటుంబ సభ్యులు ఎంతమంది అంటే..!

మునుగోడు అభివృద్ధి లక్ష్యం కాబట్టి నా పదవిని తృణప్రాయంగా వదిలేసి రాజీనామా చేసి బిజెపి పార్టీ నుంచి పోటీ చేశాను. 12000 కూడా లేని బిజెపి ఓటు బ్యాంకును 86 వేలకు తీసుకుపోయానన్నారు.  నా ఒక్క రాజీనామా తోనే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఎమ్మెల్యేలు మంత్రులు ఈ మునుగోడు వీధిలో వెంబడి తిప్పినాను. దేశము మొత్తం మునుగోడు వైపు చూసేలా చేశాను అన్నారు.

నా రాజీనామాతో భూ నిర్వాసితుల డబ్బులు ఒక్క నెలలో ఇప్పించగలిగాను. గ్రామపంచాయతీ పెండింగ్ లో ఉన్న అన్ని పనుల బిల్లులను ఒక్క నెలలోనే రిలీజ్ చేయించగలిగాను. గట్టుపల మండలం. చండూర్ రెవిన్యూ. ఇవన్నీ విజయాలు నేను పేద ప్రజల మనిషిని. నన్ను ఆదరిస్తే మీరు గుండెపై చేయి వేసుకొని హాయిగా ఉండవచ్చు అన్నారు.

ALSO READ : మహిళలకు, రైతులకు భారీ గుడ్ న్యూస్.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో సంచలన హామీలు..!

నాకు పదవులు ముఖ్యం కాదు ప్రజల శ్రేయస్సు ముఖ్యం. బిఆర్ఎస్ పార్టీ నాపై అభినందనలు వేస్తుంది. టిఆర్ఎస్ పార్టీ నుంచి వలసలను ఆపలేని అసమర్థులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. ఒకవేళ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే. మొన్న ఉపయోగంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిన ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు మళ్లీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరుతున్నారు అన్నారు.

దీనికి నిదర్శనం అంతా మాయ అని. కాబట్టి మునుగోడు ప్రజలారా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను అన్నారు.

ALSO READ : యువతకు ఉద్యోగాలు సృష్టించాలనేదే నా ముందున్న సవాల్.. మంత్రి జగదీష్ రెడ్డి..!

ఈ కార్యక్రమంలో ఏఐసిసి పరిశీలకులు రాజశేఖర్. ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ పున్నం కైలాస్ నేత. నారా బోయిన రవి. సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం. మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముద్దం నరసింహ గౌడ్. రాందాసు శ్రీను. బ్లాక్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కళ్లెం జైపాల్. బాలయ్య. భీమా నాయక్. శీను నాయక్. మండల కోశాధికారి శ్రీనివాస్ యాదవ్. యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బేత వెంకటేష్. మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి నజీర్. కొండూరు గ్రామ శాఖ ఖదీర్ తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : ధ‌ర‌ణి తీసేస్తే కైలాసాన్ని పెద్ద పాము మింగినట్టు..!