ధ‌ర‌ణి తీసేస్తే కైలాసాన్ని పెద్ద పాము మింగినట్టు..!

మంచి చెడ్డలను, అంతకంటే ముఖ్యమైనది బిఆర్ఎస్ అధికారంలో ఏం మంచి పనులు చేశారు గుర్తించండి, కాంగ్రెస్ పార్టీ అనాలోచిత నిర్ణ‌యం వ‌ల్లే 58 ఏండ్లు గోస ప‌డ్డామ‌ని, ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. గురువారం నర్సాపూర్ నియోజకవర్గ పట్టణంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

ధ‌ర‌ణి తీసేస్తే కైలాసాన్ని పెద్ద పాము మింగినట్టు..!

దౌల్తాబాద్, కాసాల మున్సిపాలిటీ చేస్తాం.

బిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్

నర్సాపూర్ (హత్నూర) , మనసాక్షి :

మంచి చెడ్డలను, అంతకంటే ముఖ్యమైనది బిఆర్ఎస్ అధికారంలో ఏం మంచి పనులు చేశారు గుర్తించండి,
కాంగ్రెస్ పార్టీ అనాలోచిత నిర్ణ‌యం వ‌ల్లే 58 ఏండ్లు గోస ప‌డ్డామ‌ని, ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. గురువారం నర్సాపూర్ నియోజకవర్గ పట్టణంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ కాబ‌ట్టే 58 ఏండ్లు తెలంగాణ నాశ‌నం కావాల్సి వ‌చ్చిందని మ‌ళ్లీ ఇవాళ పెద్ద ప్ర‌మాదం పొంచి ఉంది. వచ్చే ఐదు సంవత్సరాల కోసం జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలని అన్నారు. 2000 సంవత్సరంనుచి ఎదురుచూసిన తెలంగాణ ను అందరం ఏకమై కేసీఆర్ సచ్చుడే తెలంగాణ వచ్చుడే అని ఉద్యమం చేసి తెలంగాణను సాధించుకున్నాము.

తెలంగాణ వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు , పెన్షన్లు 2014 లో వందలలో ఉన్న పెన్షన్లను వేళలో తీసుకొచ్చిన మన రాష్ట్ర ప్రభుత్వం అని అన్నారు. కంటి వెలుగు, కల్యాణ లక్ష్మి ,అమ్మ ఒడి , కెసిఆర్ కిట్ వంటి పతకాలు తెచ్చాము అని అన్నారు.

ధ‌ర‌ణి, రైతుబంధు ఎత్తేస్తాం. బ్యాంకు సదుపాయాలు, 24 గంట‌ల క‌రెంట్‌కు బ‌దులు 3 గంట‌ల క‌రెంట్ ఇస్తామ‌ని కాంగ్రెస్ నేత‌లు అంటున్నారు. ధరిని తీసేస్తే కైలాసాన్ని పెద్ద పాము మింగినట్టు అని అన్నారు. ఈ మూడు ఎత్తేస్తే రైతాంగం తీవ్రంగా న‌ష్ట‌పోతారని.

ఈ మూడింటిని ఇవ్వడం వల్లనే ప్రస్తుతం రైతులు పంటలు పండిస్తున్నారు, పండించిన పంటలకు కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతుల నష్టపోకుండా వ్యవసాయాన్ని స్థిరీకరించాలి అని ఈసారి రైతుబంధు రైతులకు 16 వేల వరకు చేస్తానని అన్నారు.

ALSO READ : మిర్యాలగూడ : బీఆర్ఎస్ అభ్యర్థి భాస్కరరావు అనుచరుల ఇళ్లలో ఐటి సోదాలు.. ఏకకాలంలో 40 బృందాలతో సోదాలు..!

ధరణి ఉండడం వల్లనే భూముల ధరలు పెరిగాయని, వ్య‌వ‌సాయ స్థీరిక‌ర‌ణ జ‌రిగి రైతులు కుదుట‌ప‌డ్డారని. 24 గంట‌ల సరఫరా బందు చేసి, మూడు గంటల విద్యుత్ ను ఇస్తామని, రైతులు 10 హెచ్‌పీ మోటార్లు పెట్టుకోవాల‌ని పి సి సి అంటుండని, రైతుల వ‌ద్ద 10 హెచ్‌పీ మోటార్ ఉంటదా. 3 హెచ్‌పీ, లేదంటే 5 హెచ్‌పీ పెట్టుకుంటాం. నీళ్లు బాగా ఉంటే 5 హెచ్‌పీ పెట్టుకుంటాo . ధ‌ర‌ణి, రైతుబంధును బంగాళాఖాతంలో వేస్తామ‌ని కాంగ్రెస్ నేత‌లు అంటున్నారని, ఎవ‌ర్ని బంగాళాఖాతంలో వేయాలో ప్ర‌జ‌లు నిర్ణయిస్తారన్నారు.

తెలంగాణ ప్ర‌జ‌లు క్షేమంగా ఉండాలంటే పార్టీల న‌డ‌వ‌డిక, చ‌రిత్ర గురించి ఆలోచించి ఓటేయాలని, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రైతాంగం న‌ష్ట‌పోతారని రైతులు సరైన నిర్ణ‌యం తీసుకుని ఓటు వేయాలన్నారు. అసైన్ భూములను త్వరగా పట్టాలు చేసి ఇస్తామని, మన ప్రభుత్వంలో మంజీరా నది, హల్దీ నది మీద డ్యాములు కట్టించాం అని ఇప్పుడు బ్రహ్మాండంగా నీళ్లు పుష్కలంగా ఉన్నాయని అన్నారు.

ALSO READ : Elections : ఎన్నికల్లో ఓటు వేస్తారా.. ఆ సెకండ్లే కీలకం.. ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!

బిఆర్ఎస్ గెలిస్తేనే సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి అని అన్నారు. దౌల్తాబాద్, కాసాల మున్సిపాలిటీ చేస్తామని, హత్నూర మండల గ్రామాలు కొన్ని జిన్నారం మండలంలో కలుపుతామని, ఐ టీ ఐ నిర్మిస్తామని, మదన్ రెడ్డి గౌరవ పదవుల్లో ఉంటారని నాకు కలకాలం మిత్రుడని అన్నాడు. అంతేకాకుండా ముస్లిం మైనార్టీల అన్న తముడుల్లను కోరుతూ బి ఆర్ ఎస్ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి ఓటు వేసి గెలిపించాలని అన్నారు.

సునీత లక్ష్మారెడ్డి గెలిస్తే ఎమ్మెల్యేగా ఆ ప్రాంతానికి ఆ ప్రభుత్వం ఏర్పడుతుంది. అంతేకాకుండా కాంగ్రెస్ నాయకుడు గాలి అనిల్ కుమార్, బిజెపి నాయకులు సింగాయపల్లి గోపి, తన కార్యకర్తలతో ముఖ్యమంత్రి కెసిఆర్ చేతుల మీదుగా కండువా కప్పించుకొని బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు , ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి, చిలుముల మదన్ రెడ్డి , స్థానిక బీ ఆర్ ఎస్ నాయకులు ప్రజలు హాజయ్యారు.

ముఖ్యమైన వార్తలు క్లిక్ చేసి చదవండి :