మిర్యాలగూడ : టపాకాయల వ్యాపారుల మధ్య వివాదం.. గొడ్డలితో దాడి..!

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో టపాకాయల వ్యాపారుల మధ్య వివాదం చోటు చేసుకోగా గొడ్డలితో దాడి జరిగిన సంఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది.

మిర్యాలగూడ : టపాకాయల వ్యాపారుల మధ్య వివాదం.. గొడ్డలితో దాడి..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో టపాకాయల వ్యాపారుల మధ్య వివాదం చోటు చేసుకోగా గొడ్డలితో దాడి జరిగిన సంఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని జగడం అశోక్ టపాకాయల వ్యాపారం నిర్వహిస్తున్నాడు.

ALSO READ : సూర్యాపేట : బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. బిఎస్పీలో ప్రముఖుల చేరిక..!

అతనికి సమీపంలోనే మరో వ్యాపారి జాస్తి గోపి కూడా వ్యాపారం నిర్వహిస్తున్నాడు. కాగా జాస్తి గోపి తన దుకాణ రెన్యువల్ చేసుకోకపోవడంతో తనిఖీలకు వచ్చిన అధికారులు దుకాణాన్ని సీజ్ చేశారు. కాగా జగడం అశోక్ తనపై ఫిర్యాదు చేయడంతోనే అధికారులు తన షాప్ సీజ్ చేశారనే ఆవేశంతో గోపి తో పాటు అతని కుటుంబ సభ్యులు అశోక్ పై గొడ్డలితో దాడికి పాల్పడ్డారు.

ALSO RAD : భర్తను హత్య చేసిన భార్య.!

అశోక్ దుకాణాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. వారి నుంచి తప్పించుకున్న అశోక్ మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు నిందితులపై అత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ రాఘవేందర్ తెలిపారు.

ALSO READ : కాంగ్రెస్ పార్టీ ఫైనల్ లిస్ట్ విడుదల.. మిర్యాలగూడ బత్తుల లక్ష్మారెడ్డికి టికెట్..!