భర్తను హత్య చేసిన భార్య.!

మద్యం తాగి వేధింపులకు గురి చేస్తుండడంతో భార్య.. తట్టుకోలేక భర్తను హతమార్చిన సంఘటన కోదాడ పరిధిలో చోటుచేసుకుంది. ఈ విషయం శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

భర్తను హత్య చేసిన భార్య.!

కోదాడ రూరల్ , మన సాక్షి :

మద్యం తాగి వేధింపులకు గురి చేస్తుండడంతో భార్య.. తట్టుకోలేక భర్తను హతమార్చిన సంఘటన కోదాడ పరిధిలో చోటుచేసుకుంది. ఈ విషయం శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

కొమరబండ కు చెందిన కమల పుల్లయ్య (45) అనుమానాస్పద స్థితిలో శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు. కాగా శనివారం సోదరులు, బంధువులు అంత్యక్రియలు నిర్వహించే సమయంలో మృతుడి మెడపై గాయాలు కనిపించాయి. దాంతో అనుమానం వచ్చిన వారు భార్య ఆదిలక్ష్మిని నిలదీశారు.

ALSO READ : BIG BREAKING : పొంగులేటి నివాసంలో ఐటి, ఈడి సోదాలు..! ఖమ్మం , మన సాక్షి :

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మృతుడి భార్యను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా మద్యం తాగి వేధింపులకు గురిచేస్తుండగా మెడకు వైరు బిగించి హత్య చేసినట్లు పోలీసుల విచారణ తేలినట్లు సమాచారం.

ఆమెతోపాటు మరెవరైనా ఈ హత్యలో ఉన్నారా.. అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. వీరికి వివాహమైన కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.

ALSO READ : Komatireddy : సీఎం పదవిపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!