Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Komatireddy : సీఎం పదవిపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

Komatireddy : సీఎం పదవిపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

ఎప్పుడో ఒకసారి నేను సీఎం అవుతా..!   

నల్లగొండ అశ, ఆశ, శ్వాస, మరోసారి సేవ చేసే అవకాశం కల్పించాలి

అట్టహాసంగా నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

నల్లగొండ, మన సాక్షి :

తాను ఎప్పుడూ ఒకసారి సీఎం అవుతానాని నామినేషన్ సందర్భంగా అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి మంగళవారం స్థానిక గడియారం సెంటర్లో నల్లగొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన నల్లగొండ నియోజక వర్గాన్ని ప్రాణం ఉన్నంతవరకు మర్చిపోనన్నారు .

నాలుగు సార్లు ఎమ్మెల్యేగ, గెలిపించి రాజకీయంగా ఉన్నత స్థానం కల్పించారాని అన్నారు .నల్లగొండ నియోజకవర్గ ప్రజల కోసం ఎలాంటి త్యాగాలకైన సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మరోసారి గెలిపించి సేవ చేసే అవకాశం కల్పించాలని, నల్లగొండ అభివృద్ధి జరగలేదన్నారు.

ALSO READ : Telangana Elections : తెలంగాణ ఎన్నికల్లో విచిత్ర పరిస్థితి.. ఆ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్..!

గత ఎన్నికలలో దత్తత పేరుతో సీఎం కేసీఆర్ నల్గొండ నియోజకవర్గ ప్రజలను వంచకు గురిచేశారని అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమాకాంక్షను సోనియా గాంధీ నెరవేర్చిందని త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నియంత పాలన సాగిస్తున్నాడు అన్నారు.

అంతకుముందు వీటి కాలనీలోని వెంకటేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించి అక్కడి నుండి భారీ ర్యాలీగా ఆర్డీవో కార్యాలయం చేరుకొని అక్కడ నామ పత్రాలు దాఖలు చేశారు.

ALSO READ : మేడిగడ్డ కుంగి పోతుంటే.. కేసీఆర్ సాగర్ ప్రాజెక్టు గురించి మాట్లాడ్డం విడ్డూరం..!

కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్, నకరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేముల వీరేశం ,నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫోర్ లీడర్ శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్  రమేష్ గౌడ్, నల్గొండ జడ్పిటిసి వంగూరు లక్ష్మయ్య ,ఎంపీపీ మనుమతి సుమన్ తిప్పర్తి జడ్పిటిసి  రామిరెడ్డి, నల్గొండ  జిల్లా మహిళా కాంగ్రెస్అధ్యక్షురాలు గోప గానీమాధవి. కనగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డం అనపర మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, తిప్పర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ALSO READ : Congress third List : 16 మందితో కాంగ్రెస్ మూడవ జాబితా

మరిన్ని వార్తలు