మేడిగడ్డ కుంగి పోతుంటే.. కేసీఆర్ సాగర్ ప్రాజెక్టు గురించి మాట్లాడ్డం విడ్డూరం..!

ప్రజల జీవితాలు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి,కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినా అది కుంగిందని ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మేళ్లచెరువు, మండల కేంద్రంలో బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం ఆదివారం జరిగింది.

మేడిగడ్డ కుంగి పోతుంటే.. కేసీఆర్ సాగర్ ప్రాజెక్టు గురించి మాట్లాడ్డం విడ్డూరం..!

అప్పులు తెచ్చి కట్టినా కాళేశ్వరం కుంగింది

కాళేశ్వరంపైనే దేశమంతా చర్చ –  ఎంపి ఉత్తమ్

మేళ్లచెరువు:

ప్రజల జీవితాలు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి,కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినా అది కుంగిందని ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మేళ్లచెరువు, మండల కేంద్రంలో బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం ఆదివారం జరిగింది.

సమావేశంలో ఉత్తమ్ పాల్గొని మాట్లాడారు. ఓ పక్క మేడిగడ్డ కుంగి పోతుంటే ఈ కేసీఆర్ సాగర్ ప్రాజెక్టు గురించి మాట్లాడ్డం విడ్డూరంగా ఉందని అన్నారు. ఒక్క ఎకరాకు కూడా నీళ్లందించని కాళేశ్వరం కోసం లక్షల కోట్లు అప్పులు తెచ్చారని, కల్వకుంట్ల ఫ్యామిలీకి అది ఎటిఎంలా మారిందని చెప్పారు.

ALSO READ : రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విద్యార్థి ఉద్యమకారుడు వేముల గోపినాథ్

తానే ఇంజనీర్ నై ప్రాజెక్టు నిర్మించానన్న కేసీఆర్ ఇప్పుడేం చెప్తారని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇదే చర్చ నడుస్తున్నదని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. అరవై ఏళ్లనా తాము నిర్మించిన సాగర్ ప్రాజెక్టు ఎందుకు కుంగలేదని ఎదురు ప్రశ్నించారు.

రైతుబందు ఆపాలని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారని కేసీఆర్ ప్రచారం చేస్తున్నారని,ఓటమి భయంతోనే ఈ అబద్దాలు చెప్తున్నారని అన్నారు. నామినేషన్ల లోపులో అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేయాలని తాము చెబితే దానిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వెలిబుచ్చారు. ప్రజల మైండ్ సెట్ మారిందని ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఇంటికి పంపాలా అని వారే ఎదురు చూస్తున్నారని అన్నారు.

ALSO READ : మాడ్గులపల్లి : ట్రాక్టర్ పై నుండి పడి వ్యక్తి దుర్మరణం.. మిర్యాలగూడ లో వడ్లు అమ్ముకొని తిరిగి వస్తుండగా ప్రమాదం..!

ఇంటింటికీ వెళ్లి ఆరు గ్యారంటీలపై వివరించి స్టిక్కర్ అంటించాలని సూచించారు. మూడు రోజుల్లో ఈ పనులు పూర్తి చేయాలని చెప్పారు. ఉమ్మడి మేళ్లచెరువు మండలం లో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ యువ నాయకులు, ఎన్నారై అన్నపురెడ్డి అప్పిరెడ్డి ప్రతిపాదించారు.

ఆ స్కూల్ ద్వారా పేద విద్యార్ధులకు ఉచిత విద్యను అందించి, ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దవచ్చని సూచించారు. కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి, రామచందర్ రావు, సైదేశ్వర్ రావు, గోవిందరెడ్డి, నర్సింహారెడ్డి, శంకర్ రెడ్డి, సురేష్, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

ALSO READ : నల్గొండ : కెసిఆర్ నియంత పాలన, దోపిడీ నుంచి విముక్తి పొందాలి