రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విద్యార్థి ఉద్యమకారుడు వేముల గోపినాథ్

నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం ఊట్కూర్ గ్రామానికి చెందిన తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుడు, సామజిక కార్యకర్త జర్నలిస్ట్ వేముల గోపినాథ్ శుక్రవారం టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విద్యార్థి ఉద్యమకారుడు వేముల గోపినాథ్

శాలిగౌరరారం, మనసాక్షి

నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం ఊట్కూర్ గ్రామానికి చెందిన తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుడు, సామజిక కార్యకర్త జర్నలిస్ట్ వేముల గోపినాథ్ శుక్రవారం టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉస్మానియా, కాకతీయ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి చెందిన తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు పెద్ద ఎత్తున చేరారు.

విద్యార్థులంతా రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపునకు కృషి చేయాలని రేవంత్ రెడ్డి కోరారు .తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన విద్యార్థులు కాంగ్రెస్ లో చేరడం మంచి పరిణామం అని ,పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.

ALSO READ : కమ్యూనిస్టులతో కటీఫ్.. ఇక మిర్యాలగూడ కాంగ్రెస్ అభ్యర్థి అతడే..!

గోపీనాథ్ రాజకీయ ప్రస్థానం : 

ఉమ్మడి నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల వాసి వేముల గోపీనాథ్.. 2009 మలిదశ తెలంగాణ ఉద్యమంలో తుంగతుర్తి, నకిరేకల్, సూర్యాపేట, నల్లగొండ ప్రాంతాల్లో పాదయాత్ర, బస్సు యాత్ర,రాస్తారోకోలు, సకల జనుల సమ్మె, ,పేదోళ్లకైనా – ఉన్నోళ్లకైనా ఒకే బడి ఒకే చదువు నినాదంతో పల్లె బాట కార్యక్రమంతో పాటు అనేక పోరాట కార్యక్రమాలలో పాల్గొన్నారు.. ప్రత్యేక తెలంగాణ కోసం అసెంబ్లీ ముట్టడి, రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొని ఎన్నోసార్లు అరెస్ట్ అయ్యాడు.

మిలియన్ మార్చ్ కార్యక్రమంలో తనదైన పాత్ర పోషించాడు. ఈ ప్రాంతం నుండి విద్యార్థులను‌, యువకులను తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం చేశాడు. 2009 నుంచి 2014 వరకు తెలంగాణ సాధన కోసం ఉద్యమించిన గోపీనాథ్, తెలంగాణ రాష్టం ఏర్పటు తర్వాత తెలంగాణలో విద్యార్థి, ప్రజా సమస్యలపై పోరాటంలో భాగస్వామ్యం అయ్యారు.

ALSO READ : మాడ్గులపల్లి : ట్రాక్టర్ పై నుండి పడి వ్యక్తి దుర్మరణం.. మిర్యాలగూడ లో వడ్లు అమ్ముకొని తిరిగి వస్తుండగా ప్రమాదం..!

కరోనా సమయంలో పేదవారికి తమ వంతు సహాయంగా ముందు ఉండేవారు..అదే తరహాలో సామాజిక ఉద్యమంలో భాగస్వామ్యం అవుతూ వస్తున్నారు..తెలంగాణ విద్యార్థి వేదికలో కార్యకర్త నుండి నకిరేకల్ డివిజన్ అధ్యక్షులుగా ,ప్రధానకార్యదర్శి గా నల్గొండ జిల్లా, కోశాధికారిగా, అధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర కమిటీ సభ్యులుగా 10 సంవత్సరాలు ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ఈ తరహాలోనే ప్రజా సేవలో మరింత ముందుకు వెళ్లేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ALSO READ : సూర్యాపేట : బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. బిఎస్పీలో ప్రముఖుల చేరిక..!