కమ్యూనిస్టులతో కటీఫ్.. ఇక మిర్యాలగూడ కాంగ్రెస్ అభ్యర్థి అతడే..!

ఇంతకాలం కాంగ్రెస్, వామపక్షాల పొత్తులో ఊగిసలాడిన మిర్యాలగూడ నియోజకవర్గం ఇకపై పొత్తులు లేవని తేలింది. పొత్తులో భాగంగా మిర్యాలగూడ అసెంబ్లీ టికెట్ సిపిఎం కు కేటాయిస్తున్నారని కొంత ప్రచారం సాగినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీకే కేటాయిస్తారని కొంత ప్రచారం సాగింది. సిపిఎంకు పోత్తులో భాగంగా టికెట్ కేటాయించవద్దని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ సైతం నిర్వహించిన విషయం తెలిసిందే.

కమ్యూనిస్టులతో కటీఫ్.. ఇక మిర్యాలగూడ కాంగ్రెస్ అభ్యర్థి అతడే..!

నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ

మిర్యాలగూడ , మన సాక్షి :

ఇంతకాలం కాంగ్రెస్, వామపక్షాల పొత్తులో ఊగిసలాడిన మిర్యాలగూడ నియోజకవర్గం ఇకపై పొత్తులు లేవని తేలింది. పొత్తులో భాగంగా మిర్యాలగూడ అసెంబ్లీ టికెట్ సిపిఎం కు కేటాయిస్తున్నారని కొంత ప్రచారం సాగినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీకే కేటాయిస్తారని కొంత ప్రచారం సాగింది. సిపిఎంకు పోత్తులో భాగంగా టికెట్ కేటాయించవద్దని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ సైతం నిర్వహించిన విషయం తెలిసిందే.

కాగా దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్టు పార్టీలకు పొత్తు ఉన్నప్పటికీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు లేదని తేలింది. ఎన్నికల్లో సిపిఎం ఒంటరిగా పోటీ చేయాలని నిర్వహించిన విషయం తెలిసిందే. మిర్యాలగూడ అసెంబ్లీ స్థానం కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే విషయం తేలాల్సి ఉంది.

ALSO READ : YS Sharmila : షర్మిల పాలేరులో పోటీ చేస్తుందా.. కాంగ్రెస్ కు మద్దతిస్తుందా..!

మిర్యాలగూడ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి అతడేనా ..?

మిర్యాలగూడ అసెంబ్లీ బరిలో ఉండేందుకుగాను ఆ పార్టీ నేతలు అనేకమంది దరఖాస్తులు చేసుకున్నారు. కాగా చివరికి పార్టీ అధిష్టానం కొంతమంది పేర్లను పరిశీలనలో పెట్టింది. ఆ తర్వాత పరిశీలన అనంతరం పొత్తులో భాగంగా సిపిఎంకు కేటాయించే విషయంపై కొంత కాలం పాటు సందిగ్ధంలో ఉంది. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ మొదటి జాబితాలో 55 మందికి, రెండవ జాబితాలో 45 మందికి టికెట్లు ఖరారు చేస్తూ ప్రకటించింది.

ALSO READ : BIG BREAKING : కాంగ్రెస్ తో సిపిఎం పొత్తు విఫలం.. ఒంటరిగా పోటీకి సిద్ధమైన సిపిఎం..!

వారి వారి స్థానాల్లో ఆ అభ్యర్థులు ప్రచారాలు సైతం నిర్వహిస్తున్నారు. మిగతా 19 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. పొత్తులో భాగంగా నాలుగు స్థానాలు పోగా 15 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించాల్సి ఉండే.. కానీ ప్రస్తుతం కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు లేకపోవడం వల్ల 19 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

కాంగ్రెస్ పార్టీ తుది జాబితా శనివారం ఉదయం గాని శుక్రవారం రాత్రి కానీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. మిర్యాలగూడ స్థానాన్ని అడుగుతున్న నేతల్లో మాజీమంత్రి సీనియర్ కాంగ్రెస్ నాయకులు జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీర్ రెడ్డి, ఇప్పటికే రెండు పర్యాయాలు (ఒక పర్యాయం పిఆర్పి ,మరో పర్యాయం టిఆర్ఎస్) నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తో ఓటమిపాలైన అలుగుబిల్లి అమరేందర్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్, మిర్యాలగూడ మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ , సామాజికవేత్త బత్తుల లక్ష్మారెడ్డి తో పాటు పలువురు ఉన్నారు ఉన్నారు.

ALSO READ : కాంగ్రెస్ కి జై కొట్టిన వైఎస్ షర్మిల.!

ఇద్దరు ఎంపీల మద్దతు..?

మున్సిపల్ కాంగ్రెస్ ఉన్న బత్తుల లక్ష్మారెడ్డి ( బీ ఎల్ ఆర్) కు కాంగ్రెస్ పార్టీకి చెందిన నల్లగొండ జిల్లా ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం బత్తుల లక్ష్మారెడ్డి పేరును సూచిస్తున్నట్లు సమాచారం.

టికెట్ల కేటాయింపులో ఐదు మంది స్టీరింగ్ కమిటీలో ఉండగా ఇద్దరు ఎంపీలు కూడా స్టీరింగ్ కమిటీలో సభ్యులు గానే ఉన్నారు. స్టీరింగ్ కమిటీలో ఉన్న ఇద్దరు సభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి కే అభ్యర్థి పేరును సూచించడంతో ఆయనకే టికెట్ వస్తుందని ఆయన వర్గీయులు జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు.

అదేవిధంగా జానారెడ్డి కుమారుడికి తండ్రి ఆశీస్సులు ఉన్నాయని, అమరేందర్ రెడ్డి , శంకర్ నాయక్ కు జానారెడ్డి తో పాటు పలువురి నాయకుల అండదండలు ఉన్నాయనే ప్రచారం సాగుతుంది. ఏది ఏమైనా తుది జాబితాలో మిర్యాలగూడ అభ్యర్థి ఎవరు అనే విషయం తేలనున్నది.

ALSO READ : మాడ్గులపల్లి : ట్రాక్టర్ పై నుండి పడి వ్యక్తి దుర్మరణం.. మిర్యాలగూడ లో వడ్లు అమ్ముకొని తిరిగి వస్తుండగా ప్రమాదం..!