సూర్యాపేట : బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. బిఎస్పీలో ప్రముఖుల చేరిక..!

బహుజన వాదాన్ని బలపరచడం కోసం సూర్యాపేట పట్టణంలోని 45 వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్, 38వ వార్డు కౌన్సిలర్ గండూరి రాధిక రమేష్ లతోపాటు వివిధ గ్రామాలకు చెందిన మాజీ ప్రజా ప్రతినిధులు, వ్యాపారవేత్తలు టిఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేసి ఆదివారం బిఎస్పి పార్టీ అభ్యర్థి జానయ్య యాదవ్ సమక్షంలో పార్టీ కండువాను కప్పుకున్నారు.

సూర్యాపేట : బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. బిఎస్పీలో ప్రముఖుల చేరిక..!

కౌన్సిలర్లు గండూరి పావని కృపాకర్ , గండూరి రాధిక రమేష్ చేరిక

సూర్యాపేట , మనసాక్షి:

బహుజన వాదాన్ని బలపరచడం కోసం సూర్యాపేట పట్టణంలోని 45 వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్, 38వ వార్డు కౌన్సిలర్ గండూరి రాధిక రమేష్ లతోపాటు వివిధ గ్రామాలకు చెందిన మాజీ ప్రజా ప్రతినిధులు, వ్యాపారవేత్తలు టిఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేసి ఆదివారం బిఎస్పి పార్టీ అభ్యర్థి జానయ్య యాదవ్ సమక్షంలో పార్టీ కండువాను కప్పుకున్నారు.

బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి 45 వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్, 38వ వార్డు కౌన్సిలర్ గండూరి రాధిక రమేష్ లతోపాటు వ్యాపారవేత్త బొమ్మగాని సైదులు గౌడ్, చివ్వెంల మండలం వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షులు నెమ్మాది మల్సూర్ ఆ పార్టీకి రాజీనామా చేసి బిఎస్పీలో చేరారు. బిజెపి ఉపాధ్యక్షులు కోదాటి విజయకుమార్ పార్టీకి రాజీనామా చేసి బిఎస్పీలో చేరారు.

రాయినిగూడెం మాజీ సర్పంచి ముత్యాల సైదులు, చివ్వెంల మాజీ ఎంపీపీ కుమారుడు ఇట్టిమల్ల స్టాలిన్, చింతల సురేష్, బిల్డర్ శ్రీనివాస్ రెడ్డి, యువజన సంఘం నాయకులు గంపల రవిచంద్ర, ఇట్టిమల్ల విక్రం, హేమంత్ తదితరులు వివిధ పార్టీలకు రాజీనామా చేసి బిఎస్సి పార్టీలో చేరారు.

ALSO READ : కమ్యూనిస్టులతో కటీఫ్.. ఇక మిర్యాలగూడ కాంగ్రెస్ అభ్యర్థి అతడే..!

ఈ సందర్భంగా కౌన్సిలర్ పావని కృపాకర్ మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానం కల్పించకపోవడంతో పార్టీలో ఉండలేక బీఎస్పీ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ప్రజా బలం లేని వారికి పదవులు అంటగడుతూ ప్రజా బలం ఉన్న మాకు అవకాశాలు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బహుజనులు అందరు ఏకమై జానన్నకు మద్దతు తెలపాలని కోరారు.

ఒక మహిళను జడ్పిటిసి ఇబ్బందులు పెడుతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోలేదని పేర్కొన్నారు. మహిళలకు గౌరవం లేని చోట ఉండలేకనే బిఎస్పి పార్టీలో చేరుతున్నారు తెలిపారు.
గండూరి రాధిక రమేష్ మాట్లాడుతూ 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన వారికి గౌరవ ఇవ్వకుండా అగౌరవ పరిచారని ఆవేదన వ్యక్తం చేశారు.

ALSO READ : Munugodu Congress : మునుగోడు కాంగ్రెస్ లో కట్టప్పలు..?

తెలంగాణ పేరు చెప్పుకునే మంత్రి జగదీష్ రెడ్డి పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం చెయ్యి విరిగితే ఇప్పటివరకు కూడా మరమ్మతులు చేపట్టలేదని విమర్శించారు. పార్టీ కోసం పని చేసిన తనను కాదని కౌన్సిలర్ టికెట్ ఇచ్చాడని, నా ఓటమి కోసం గడప గడప తిరిగిన జగదీష్ రెడ్డిని ఎవరు నమ్మక నా వెంటే జనం ఉన్నారని అన్నారు. జగదీష్ రెడ్డి నియంత పాలన తట్టుకోలేక ప్రజలు సూర్యాపేట నుంచి పంపించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పిలుపునిచ్చారు.

పార్టీలో చేరిన వారితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిఎస్పీ పార్టీ అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ మాట్లాడుతూ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రలోభాలకు గురి చేసిన, భయభ్రాంతులకు గురి చేస్తున్న లెక్కచేయకుండా బహుజనవాదం బలోపేతం చేయడానికి కౌన్సిలర్లు బీఎస్పీ పార్టీ వైపు చూస్తున్నారని అన్నారు..

జగదీష్ రెడ్డి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కోసం పోరాటం చేసిన వారికి కాకుండా ఇతరులకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కౌన్సిల్లో ప్రశ్నించినందుకుగాను పలువురు టికెట్ ఇవ్వకుండా అణగదొక్కటే ప్రయత్నం చేశాడని అన్నారు. జగదీశ్వర్ రెడ్డి మొదటిసారి పోటీ చేసినప్పుడు కనీసం ఖర్చులకు లేకపోతే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆర్థిక సాయం అందజేసి గెలిపించుకున్న సంఘటన మర్చిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు పేరుతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

ALSO READ : మాడ్గులపల్లి : ట్రాక్టర్ పై నుండి పడి వ్యక్తి దుర్మరణం.. మిర్యాలగూడ లో వడ్లు అమ్ముకొని తిరిగి వస్తుండగా ప్రమాదం..!

ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ద్వారా వ్యాపారస్తులకు ఎలాంటి లాభం లేదని, లాభం ఉందని ఏ ఒక్క వ్యాపారి అన్న నేను రాజకీయాలకు దూరంగా ఉంటాననీ శబదం చేశారు. మెడికల్ కాలేజీ బ్లూ ప్రింట్ మార్చి 500 కోట్లలో కేవలం 150 కోట్లు మాత్రమే ఖర్చు చేసి మెడికల్ కాలేజీ నిర్మించి మిగిలిన సొమ్ముతో ఫామ్ హౌస్ కట్టుకున్నారని ఆరోపించారు. సూర్యాపేట ప్రజలు చైతన్యవంతులని జగదీష్ రెడ్డి పప్పులు ఉడకపోవని ఇకనుంచి తరిమి పంపాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

కోట్ల రూపాయల తన వెంట ఉంటే కోట్ల మంది బహుజనులు నా వెంట ఉన్నారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వట్టే రేణుక యాదవ్, 6వ వార్డు కౌన్సిలర్ ధరావత్ నీలాబాయి లింగ నాయక్, సర్పంచులు కేశబోయిన మల్లయ్య, బోడబట్ల కవిత శ్రీను, ఎంపీటీసీ ఇందిర, నాయకులు చాంద్ పాషా, మీర్ అక్బర్, ఆవుల అంజయ్య, బెల్లి సైదులు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : Medigadda : మేడిగడ్డ వద్ద 144 సెక్షన్.. బ్యారేజీ సందర్శించిన రాహుల్..!