నల్గొండ : కెసిఆర్ నియంత పాలన, దోపిడీ నుంచి విముక్తి పొందాలి

తెలంగాణలో కెసిఆర్ నియంత పాలన నుంచి విముక్తి పొందాలని బిజెపి నల్గొండ అసెంబ్లీ అభ్యర్థి మాదగాని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని హైదరాబాద్ రోడ్ లో ఉన్న వీటి కాలనీ హనుమాన్ దేవాలయంలో బిజెపి నాయకులతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నల్గొండ : కెసిఆర్ నియంత పాలన, దోపిడీ నుంచి విముక్తి పొందాలి

బిజెపి నల్గొండ అసెంబ్లీ అభ్యర్థి మాదగాని శ్రీనివాస్ గౌడ్

నల్లగొండ, మనసాక్షి :

తెలంగాణలో కెసిఆర్ నియంత పాలన నుంచి విముక్తి పొందాలని బిజెపి నల్గొండ అసెంబ్లీ అభ్యర్థి మాదగాని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని హైదరాబాద్ రోడ్ లో ఉన్న వీటి కాలనీ హనుమాన్ దేవాలయంలో బిజెపి నాయకులతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం 36వ వార్డు వివేకానంద నగర్ కాలనీ, వీటి కాలనీ, యాట కన్నా రెడ్డి కాలనీలలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాదగాని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ అప్పుల ఊబీలో కూరుకుపోయిందని, ప్రజలంతా ఆలోచించి కెసిఆర్ కుటుంబ పాలన నుంచి బయటపడాలని, తెలంగాణను వారి దోపిడి నుంచి కాపాడాలని అన్నారు.

ALSO READ : కమ్యూనిస్టులతో కటీఫ్.. ఇక మిర్యాలగూడ కాంగ్రెస్ అభ్యర్థి అతడే..!

కేవలం బిజెపి ప్రభుత్వం తోనే తెలంగాణలో కెసిఆర్ అవినీతి అక్రమాలను ఆపగలుగుతామన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయని తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ప్రజలు అన్ని రంగాల్లో బాగుపడతారని అన్నారు.

ప్రచారంలో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఇంటింటికి వెళ్తున్న సందర్భంలో ప్రజలంతా ఆదరిస్తున్నారని, గతంలో టిడిపి, కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలకు అవకాశం ఇచ్చారని, ఈ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా నల్గొండ గడ్డపై బిజెపి గెలుస్తుందని దీమా వ్యక్తం చేశారు.

ALSO READ : మాడ్గులపల్లి : ట్రాక్టర్ పై నుండి పడి వ్యక్తి దుర్మరణం.. మిర్యాలగూడ లో వడ్లు అమ్ముకొని తిరిగి వస్తుండగా ప్రమాదం..!

బిజెపి రాష్ట్ర నాయకులు బండారు ప్రసాద్ మాట్లాడుతూ నల్గొండ నియోజకవర్గంలో మాదగాని శ్రీనివాస్ గౌడ్ కు ఎంతో అనుబంధం ఉందని ఆయన పరిచయాలు కూడా నల్గొండలో బిజెపి గెలవడానికి అవసరం అయితాయన్నారు. ప్రతి ఒక్కరు కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి శ్రీనివాస్ గౌడ్ ను గెలిపించాలని అందుకోసం పార్టీ కార్యకర్తలు బూత్ సాయి అధ్యక్షులు ప్రతి ఒక్కరూ కంకణ బద్దలే పని చేయాలని సూచించారు.

నాగం వర్షిత్ రెడ్డి, గోలి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ 20 ఏళ్లుగా నల్గొండకు ఎమ్మెల్యేగా వ్యవహరించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభివృద్ధి చేసింది శూన్యమని, నల్గొండకు అవసరం లేదని వెంకటరెడ్డిని ఓడించి బయటకు పంపిన సిగ్గు లేకుండా మళ్లీ నియోజకవర్గానికి వచ్చారన్నారు.

ALSO READ : Scam in PACS : పిఎసిఎస్ లో కుంభకోణం.. రైతుకు తెలియకుండా సిబ్బంది రుణాలు..!

టిఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి గత ఐదేళ్లుగా నల్గొండ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని అలాంటి నాయకున్ని ప్రజలు ఇంటికి పంపనున్నారన్నారు. తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి చేశానని చెప్పిన పార్టీ బిజెపి అని అలాంటి బిజెపిని బీసీలంతా ఆలోచించి ఆదరించాలన్నారు.

ఈ కార్యక్రమంలో బిజెపి అసెంబ్లీ కన్వీనర్ దాయం భూపాల్ రెడ్డి, కౌన్సిలర్లు బొజ్జ మల్లిక నాగరాజు, రావిరాల పూజిత, వెంకటేశ్వర్లు, దాసరి సాయి, నూకల వెంకట్ నారాయణ రెడ్డి,ఆవుల మధు,చర్లపల్లి గణేష్, వంగూరి రాఖి, ఏరుకొండ హరి, యాట మధు, దీక్షిత్, మిర్యాల అంజిబాబు, కుమార్, మల్లికార్జున్, నవీన్, మధుకర్ రెడ్డి, మేక శీను, ఎడ్ల వెంకన్న, పులిపల్లి రవీందర్ రెడ్డి, బాలాజీ, సురేష్, జీవన్, కిరణ్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : సూర్యాపేట : బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. బిఎస్పీలో ప్రముఖుల చేరిక..!