Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణవ్యవసాయంసూర్యాపేట జిల్లా

Scam in PACS : పిఎసిఎస్ లో కుంభకోణం.. రైతుకు తెలియకుండా సిబ్బంది రుణాలు..!

Scam in PACS : పిఎసిఎస్ లో కుంభకోణం.. రైతుకు తెలియకుండా సిబ్బంది రుణాలు..!

అనంతగిరి. నవంబర్ 02 మన సాక్షి

సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం తెల్ల పల్లి పిఎసిఎస్ లో రుణాల కుంభకోణం వెలుగు చూసింది. రైతుకు తెలియకుండా పిఎసిఎస్ లో సిబ్బంది రుణాలు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు.

సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం తెల్లబల్లి గ్రామం, అనంతగిరి మండలం వాయిల సింగారం గ్రామాలను కలిపి ఒక పీఏసీఎస్ కేంద్రంను ఏర్పాటు చేశారు. పీఏసీఎస్ లో పనిచేసే సిబ్బందులు బాధితుడు గోవిందరావుకు తెలియకుండా గోవిందరావు భార్య ధనలక్ష్మి పేరు మీద 2017 మార్చి నెలలో సొసైటీలో పనిచేసే ఇద్దరు సిబ్బందులు కలిసి 60 వేల రూపాయలు ధనలక్ష్మి పొలం పేరు మీద ఋణం తీసుకొని తమ సొంతానికి వాడుకున్నారని గోవిందరావు ఆవేదన వ్యక్తం చేశారు.

ALSO READ : Medigadda : మేడిగడ్డ వద్ద 144 సెక్షన్.. బ్యారేజీ సందర్శించిన రాహుల్..!

ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ….ఈ దొంగ ఋణం గురించి నాకు 2023 సెప్టెంబర్ నెలలో తెలిసింది. బ్యాంకు అధికారులు మొండిబకాయిల జాబితాలో మా పేరు ప్రకటించారు. నా కుటుంబానికి పరువు నష్టం కలిగించారు. నా పొలం అమ్మి నా కూతురు వివాహం చేయాలని నిర్ణయించుకున్నాను,కానీ ఆ పొలం పైన తప్పుడు ఋణం ఉండటం వలన పొలం కొనడానికి ఎవరు ముందుకు రావడం లేదు.

సొసైటీ చైర్మన్ ఇరు గ్రామాల సర్పంచులకు కార్యదర్శులకు విన్నవించుకున్న ఎలాంటి ఫలితం దక్కలేదని అన్నారు. ఉన్నతమైన చదువులు చదివి ఒక ఉన్నత అధికారిగా పనిచేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రెండుసార్లు ఉత్తమ ప్రిన్సిపల్ అవార్డు పొందిన నాకే ఇలాంటి సమస్యలు ఎదురైనది.ఇక సామాన్యుల పరిస్థితి అంతే ఇక అని తెలిపారు. నాకు న్యాయం చేయాలని వారు కోరారు.

ALSO READ : IT Attacks : తెలంగాణలో ఎన్నికలవేళ ఐటీ దాడులు.. కాంగ్రెస్ నేతల్లో కలకలం..!

మరిన్ని వార్తలు