Congress third List : 16 మందితో కాంగ్రెస్ మూడవ జాబితా

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడవ జాబితా అభ్యర్థుల ను ప్రకటించింది. 16 మందితో ఈ జాబితాను విడుదల చేశారు

Congress third List : 16 మందితో కాంగ్రెస్ మూడవ జాబితా

కేసీఆర్ పై రేవంత్ రెడ్డి పోటీ

హైదరాబాద్, మన సాక్షి:

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడవ జాబితా అభ్యర్థుల ను ప్రకటించింది. 16 మందితో ఈ జాబితాను విడుదల చేశారు.

రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ మొదటి విడతగా 55 స్థానాలు, రెండవ విడతగా 45 స్థానాలు, మూడవ విడతలో 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. వనపర్తి, బోద్ అభ్యర్థులను మార్చారు . నల్గొండ జిల్లాలో మూడు స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి.

ఇది ఇలా ఉండగా రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి పోటీలో ఉన్నారు. అక్కడి నుంచి నామినేషన్ కూడా వేశారు. అయినా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ , కామారెడ్డిలో పోటీ చేస్తుండగా రేవంత్ రెడ్డి కూడా కొడంగల్, కామారెడ్డి లో పోటీ చేస్తున్నారు. కేసీఆర్ పై రేవంత్ రెడ్డి కామారెడ్డి లో ముఖాముఖి పోటీకి తలపడనున్నారు.

ALSO READ : నల్గొండ : కెసిఆర్ నియంత పాలన, దోపిడీ నుంచి విముక్తి పొందాలి

కామారెడ్డి – రేవంత్ రెడ్డి ,
బాన్సువాడ – ఏనుగు రవీందర్ రెడ్డి,
చెన్నూరు – వివేకానంద్ ,
బోద్- గజేందర్ ,
సిరిసిల్ల – కేకే మహేందర్ రెడ్డి,
కరీంనగర్ – శ్రీనివాస్,
పటాన్ చెరువు – నీలం మధు ,
వనపర్తి – మెగా రెడ్డి ,
నిజామాబాద్- షబ్బీర్ అలీ,
జుక్కల్- లక్ష్మీకాంతరావు,
డోర్నకల్ – రామచంద్రనాయక్,
ఇల్లందు – కోరం కనకయ్య ,
వైరా – రామ్ దాస్ ,
సత్తుపల్లి – రాఘవయ్య,
అశ్వరావుపేట – ఆదినారాయణ,
నారాయణఖేడ్ సురేష్ కుమార్.
ఖరారయ్యారు.

నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ, సూర్యాపేట , తుంగతుర్తి నియోజకవర్గ అభ్యర్థుల ను ప్రకటించలేదు. వనపర్తి , బోద్ అభ్యర్థులను మార్చారు.

ALSO READ : మేడిగడ్డ కుంగి పోతుంటే.. కేసీఆర్ సాగర్ ప్రాజెక్టు గురించి మాట్లాడ్డం విడ్డూరం..!