మునుగోడు కాంగ్రెస్ కు భారీ షాక్.. పాల్వాయి స్రవంతి బిఆర్ఎస్ లో చేరిక..!

దివంగత నేత మాజీ మంత్రివర్యులు సీనియర్ మునుగోడు కాంగ్రెస్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు ఏఐసిసి సభ్యురాలు పాల్వాయి స్రవంతి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి. మునుగోడు బిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాదులో మున్సిపల్ శాఖ మాత్యులు కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

మునుగోడు కాంగ్రెస్ కు భారీ షాక్.. పాల్వాయి స్రవంతి బిఆర్ఎస్ లో చేరిక..!

మర్రిగూడ. నవంబర్ 12. మన సాక్షి:

దివంగత నేత మాజీ మంత్రివర్యులు సీనియర్ మునుగోడు కాంగ్రెస్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు ఏఐసిసి సభ్యురాలు పాల్వాయి స్రవంతి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి. మునుగోడు బిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాదులో మున్సిపల్ శాఖ మాత్యులు కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

మంత్రి కేటీఆర్ బిఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పాల్వాయి స్రవంతి మాట్లాడుతూ మా నాన్నగారు మునుగోడు పార్టీకి పునాది వేశారు. పార్టీకి అనేక సేవలు చేశారు. ఆయన చనిపోయిన తర్వాత మునుగోడు కాంగ్రెస్ పార్టీకి చాలా కష్టపడి క్యాడర్ను కాపాడుకుంటూ వచ్చానని అన్నారు.

ALSO READ : డ్రామారావు డైరెక్షన్ అంటే ఇట్లనే ఉంటది.. ట్విట్టర్ లో పోస్ట్..!

అపోజిషన్ పార్టీ వాళ్లు నన్ను ఇంత ఇబ్బందుల గురిచేసిన క్యాడర్ను ఏమాత్రం చెక్కుచెదరనియకుండా కాపాడుతూ వచ్చిన నన్ను ఏమాత్రం సంప్రదించకుండా పూటకు ఒక పార్టీ మారే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో తను తీవ్రంగా మనస్థాపానికి గురయ్యానని అన్నారు.

ఒక డబ్బుల అహంకారికి ఇలా పూటకు ఒక పార్టీ మారేవారికి అధిష్టానం కూడా ఏ విధంగా టికెట్ ఇస్తుందని ప్రశ్నించినందుకు పార్టీలో తనకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదు కాబట్టి ఈరోజు నా పదవికి పార్టీకి రాజీనామా చేస్తూ బిఆర్ఎస్ పార్టీలో చేరానని చెప్పారు.

పాల్వాయి స్రవంతి తో పాటు పార్టీలో చేరిన నేతలు మళ్లీ రెడ్డి గోవర్ధన్ రెడ్డి. తుప్పరి యాదయ్య. రామస్వామి. రఘు. బర్రెల రవి. మామిడి సాయికుమార్. పందుల నగేష్. ఇరుగంటి అభిలాష్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మర్రిగూడ ఎంపీపీ మెండు మోహన్ రెడ్డి. బండి నగేష్ గౌడ్ పాల్గొన్నారు.

ALSO READ : BIG BREAKING : సగం కాలి పడి ఉన్న మహిళ మృతదేహం..!