మిర్యాలగూడ : గులాబీమయం.. కాంగ్రెస్ సన్నాసులంటూ రెచ్చిపోయిన కేటీఆర్..!

నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం మిర్యాలగూడ పట్టణంలో నిర్వహించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నిర్వహించిన రోడ్ షో తో పట్టణం గులాబీమలమైంది.

మిర్యాలగూడ : గులాబీమయం.. కాంగ్రెస్ సన్నాసులంటూ రెచ్చిపోయిన కేటీఆర్..!

మిర్యాలగూడ , మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం మిర్యాలగూడ పట్టణంలో నిర్వహించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నిర్వహించిన రోడ్ షో తో పట్టణం గులాబీమలమైంది.

సాయంత్రం నాలుగు గంటలకు మిర్యాలగూడ చేరుకున్న కేటీఆర్ స్థానిక ఎమ్మెల్యే టిఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కరరావు తో కలిసి హనుమాన్ పేట ఫ్లైఓవర్ బ్రిడ్జి నుంచి రాజీవ్ చౌక్ వరకు రోడ్ షో నిర్వహించారు.

ఈ సందర్భంగా అభిమానులు గజమాలను వేశారు. అనంతరం రాజీవ్ చౌక్ వద్ద నిర్వహించిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుల పై రెచ్చిపోయారు. కాంగ్రెస్ సన్యాసులు వస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందన్నారు.

11 సార్లు అవకాశం ఇచ్చినా ఏం చేయలేదన్నారు. రైతు బంధు ఆలోచన వారికి రాలేదని తీవ్రంగా విమర్శించారు. రైతుబంధు వృధా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి మూడు గంటల విద్యుత్ సరిపోతుందని రేవంత్ రెడ్డి అంటున్నారని మళ్లీ కాంగ్రెస్ వస్తే రైతులకు కష్టకాలం వస్తుందన్నారు.

ALSO READ : BIG BREAKING : గొడ్డళ్లు, కత్తులతో సూర్యాపేట బిఎస్పి అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ పై దాడి

అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాల విభజన సమయంలో మిర్యాలగూడ జిల్లా చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. స్థానిక శాసనసభ్యులు మిర్యాలగూడ ప్రజల కోరిక మేరకు మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు చేస్తామన్నారు. సౌమ్యుడు, మిర్యాలగూడ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసే నల్లమోతు భాస్కరరావును గెలిపించాలని కోరారు.

రోడ్ షోలో మున్సిపల్ చైర్మన్ తిరు నగర్ భార్గవ్ , బీఆర్ఎస్ నాయకులు అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి , రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, టిఆర్ఎస్ యువ నాయకులు నల్లమోతు సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు .

ALSO READ : మిర్యాలగూడ : సిపిఎం, టిఆర్ఎస్ కు భారీ షాక్.. కాంగ్రెస్ లో చేరిన కౌన్సిలర్లు , మాజీ కౌన్సిలర్లు..!