Breaking Newstravelజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

Telangana : మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంలో కీలక మార్పులు.. 2024 జనవరి 1 నుంచి ఆ స్కీమ్స్ ఉపసంహరణ..!

Telangana : మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంలో కీలక మార్పులు.. 2024 జనవరి 1 నుంచి ఆ స్కీమ్స్ ఉపసంహరణ..!

హైదరాబాద్, మన సాక్షి :

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీల లో భాగంగా మహాలక్ష్మి పథకం ను అమలు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టారు. అందులో భాగంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం సౌకర్యాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.

రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి భారీ స్పందన లభిస్తుంది. ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఆర్టీసీ బస్సులలో ప్రయాణించే మహిళలకు జీరో టికెట్ కూడా కండక్టర్లు అందిస్తున్నారు.

ALSO READ : రేషన్ కార్డుదారులకు బిగ్ రిలీఫ్.. కేవైసీ గడవు పెంచిన ప్రభుత్వం..!

కాగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంలో 2024 జనవరి 1వ తేదీ నుంచి కీలక మార్పులు చేయాలని ఆర్టీసీ ఎండి సజనర్ నిర్ణయించారు. కాగా తాజాగా సజ్జనార్ ట్విట్టర్ వేదికగా ఆర్టీసీ యాజమాన్య నిర్ణయాన్ని ప్రకటించారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలవుతున్న గ్రేటర్ హైదరాబాదులో కీలక మార్పులు చేస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాదులో జారీ చేసిన ఫ్యామిలీ – 24, టి -6 టికెట్లను ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు ట్విట్టర్ లో పేర్కొన్నారు.

ALSO READ : ఇక..అవ్వా తాతలకు నెలకు రూ.3వేలు..!

మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం వల్ల ఫ్యామిలీ – 24, టి -6 టికెట్లను పూర్తిగా ఉపసంహరించుకున్నట్లు సజ్జనార్ వెల్లడించారు.

ALSO READ : బొలెరో వాహనం ఢీకొని వ్యక్తి మృతి..!

మరిన్ని వార్తలు