ఇక..అవ్వా తాతలకు నెలకు రూ.3వేలు..!

ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాల సంక్షేమం ,అభివృద్ధి కోసం  రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. 20 24 జనవరి నెల నుండి వైయస్సార్ పెన్షన్ కానుక ను మూడు వేల రూపాయలకు పెంచి లబ్ధిదారులకు అందించడం జరుగుతుంది అన్నారు.

ఇక..అవ్వా తాతలకు నెలకు రూ.3వేలు..!

మెలియాపుట్టి, మన సాక్షి:

ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాల సంక్షేమం ,అభివృద్ధి కోసం  రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. 20 24 జనవరి నెల నుండి వైయస్సార్ పెన్షన్ కానుక ను మూడు వేల రూపాయలకు పెంచి లబ్ధిదారులకు అందించడం జరుగుతుంది అన్నారు.

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం లో కొత్తూరు, హిరమండలం, పాత పట్టణ మండలంలో బైదలాపురం గ్రామంలో వైయస్సార్ పెన్షన్ పెంపు కానుక సంబరాలు ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అవ్వ ,తాతలకు అధిక మొత్తం గా వైయస్సార్ పెన్షన్ 3000 రూపాయలు లబ్ధిదారులకు జనవరి నుండి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లిస్తారన్నారు.

ALSO READ : అన్ని వర్గాల వారికి సంక్షేమ సంఘం అండగా నిలవాలి.. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

గతంలో చంద్రబాబు అధి కారంలో ఉన్నప్పుడు పింఛన్లు ఎంత ఇచ్చేవాడో మనందరికీ తెలుసునన్నారు. ముఖ్యమంత్రి జగనన్న తన పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పెంచుకుంటూ పోతామని తెలిపిన విధంగా పింఛన్ పెంచారన్నారు.

గతంలో 65 సంవత్సరాలు ఉంటే కానీ ఇవ్వని పింఛన్లు నేడు 60 సంవత్సరాలు వయసు ఉంటే అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ అందించడం జరుగుతుందని తెలిపారు. అందరికీ సంక్షేమ పథకాలు ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టంలేదన్నారు. . గతంలో జన్మభూమి కమిటీలు చెప్పినట్లు మనం నడుచుకోవలసి వలసి వచ్చేదని గుర్తుచేశారు.

ALSO READ : రేషన్ కార్డుదారులకు బిగ్ రిలీఫ్.. కేవైసీ గడవు పెంచిన ప్రభుత్వం..!

నేడు సచివాలయ వ్యవస్థలు ద్వారా నేరుగా సంక్షేమ పథకాలు గుమ్మం వద్దకే వస్తున్నా యని వివరించారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పద్నాలుగున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు ప్రజలకు ఏం చేసాడో గుర్తించుకో వాలన్నారు.

మనకోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని మరల గెలిపించుకోవాలని కోరారు. పాతపట్నం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా రెడ్డి శాంతిని గెలిపించాలని కోరారు. ఆమెతోపాటు పలువురు వైసీపీ నాయకులు తదితరులు ఉన్నారు.

ALSO READ : పాపం పసిబాలుడు.. సెకన్ల వ్యవధిలో తల్లి ఒడి నుంచి మృత్యు ఒడిలోకి..!