బొలెరో వాహనం ఢీకొని వ్యక్తి మృతి..!

బొలెరో వాహనం ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి చెందిన సంఘటన దేవరకొండ సమీపంలోని మల్లేపల్లిలో చోటుచేసుకుంది.

బొలెరో వాహనం ఢీకొని వ్యక్తి మృతి..!

దేవరకొండ, మనసాక్షి:

బొలెరో వాహనం ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి చెందిన సంఘటన దేవరకొండ సమీపంలోని మల్లేపల్లిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..

మల్లేపల్లి కి చెందిన గంజి శ్రీనివాస్ అనే వ్యక్తి తన యొక్క మోటార్ సైకిల్ పై ఆదివారం రాత్రి ఒకటిన్నర గంటల సమయంలో  దేవరకొండ నుండి మల్లెపల్లి వెళుచుండగా మార్గమధ్యలో పెద్ద దర్గా సమీపంలో మల్లెపల్లి నుండి దేవరకొండ వైపు వెళ్ళు బొలెరో వాహనము యొక్క డ్రైవరు అతివేగంగా నడిపి సదరు గంజి శ్రీనివాస్ మోటార్ సైకిల్ కు టక్కరి ఇవ్వగా గంజి శ్రీనివాస్ కాలుకి తలకు తీవ్ర గాయాలు అక్కడికక్కడే చనిపోయినాడు.

ALSO READ : రేషన్ కార్డుదారులకు బిగ్ రిలీఫ్.. కేవైసీ గడవు పెంచిన ప్రభుత్వం..!

తెల్లవారుజామున పెద్ద దర్గా సమీమృతుడు కొండమల్లేపల్లిలో అంబికా ఫ్యాన్సీ జనరల్ స్టోర్ యజమాని గంజి శ్రీను(48) గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు . గంజి శ్రీనివాస్ భార్య ఫిర్యాదు మేరకు ఎస్సై సతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ALSO READ : BREAKING : సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం..!