Guntur karam : గుంటూరుకారం సినిమా విలన్స్ పేర్లలో వివాదం.. ఆందోళనలకు సిద్ధం..!
Guntur karam : గుంటూరుకారం సినిమా విలన్స్ పేర్లలో వివాదం.. ఆందోళనలకు సిద్ధం..!
పీడీఎస్ఈు జిల్లా ప్రధాన కార్యదర్శి మస్తాన్
నేలకొండపల్లి, మన సాక్షి :
మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా వివాదంలో చిక్కుకుంది. సంక్రాంతి పండుగకు విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ గా ప్రేక్షకుల ఆదరిస్తుంది. కాగా ఈ సినిమాలోని పాత్రలకు ఉన్న పేర్ల విషయంలో వివాదం నెలకొన్నది.
గుంటూరు కారం సినిమా లో విలన్స్ మార్క్స్, లెనిన్ పేర్లు ను పెట్టటం సరికాదని వెంటనే తొలిగించాలని పీడీఎస్ఈయు జిల్లా ప్రధాన కార్యదర్శి జీ.మస్తాన్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు..
ALSO READ : Good News : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్.. ఉచితంగా..!
సినిమా డైరెక్టర్స్ త్రివిక్రమ్ కు మతిబ్రమించిందని అన్నారు. శ్రామిక వర్గ నేతలు, మార్కిస్ట్ మహోపాధ్యాయుల పేర్లు పెట్టి సమాజానికి తప్పుడు అవగాహన కల్పిస్తున్నారని ఆరోపించారు. దోపిడి, పీడన, అణిచివేత లేని సోషలిస్టు సమాజాన్ని ఏర్పర్చినట్లు తెలిపారు.
అలాంటి మహానేతల పేర్లు ను సినిమాలో విలన్స్ కు పెట్టటం మంచిది కాదని హెచ్చరించారు. అలాగే సినిమా లో మడత కుర్చీ బూతు పాట ను పెట్టటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ తప్పిదం డెరెక్టర్. హిరో ఇరువురు కూడ బేషరతుగా క్షమాపణచెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా సినిమా ప్రదర్శ ను అడ్డుకుంటామని హెచ్చరించారు.
ALSO READ : Hanuman : హనుమాన్ హీరో తేజ సజ్జా కంటిచూపు కోల్పోయింది.. వైద్యులు ఏమన్నారంటే..?









