Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణసినిమా

Hanuman : హనుమాన్ హీరో తేజ సజ్జా కంటిచూపు కోల్పోయింది.. వైద్యులు ఏమన్నారంటే..?

Hanuman : హనుమాన్ హీరో తేజ సజ్జా కంటిచూపు కోల్పోయింది.. వైద్యులు ఏమన్నారంటే..?

మనసాక్షి , సినిమాడెస్క్:

ఇటీవల విడుదలైన ‘హనుమాన్’ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా విడుదలైంది. ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో దూసుకుపోతుంది. యువ హీరో తేజ సజ్జా కథానాయకుడిగా ఈ సినిమా రికార్డులు సృష్టిస్తుంది. తక్కువ బడ్జెట్ తో అద్భుతమైన గ్రాఫిక్స్, విజువల్స్ అందించడం వల్ల సినీ ప్రియులంతా డైరెక్టర్ కు హ్యాట్సాఫ్ చెప్తున్నారు.

ALSO READ : మిర్యాలగూడ : సొంత అన్నని హత్య చేసిన తమ్ముడు.. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు..!

ఈ సినిమా సక్సెస్ మీట్ లో హీరో తేజ సజ్జా మాట్లాడుతూ తాను పడిన కష్టాన్ని వెల్లడించడంతో ఆయన చెప్పిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. హనుమాన్ సినిమాలో రోకలిబండతో కొట్టుకునే సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశం చేస్తున్న సమయంలో తన మెడ పట్టేసిందని, ఆ తర్వాత షూటింగ్ కూడా చేయలేకపోయినట్లు హీరో తేజ తెలిపారు. అదేవిధంగా ఈ చిత్ర కథలో భాగంగా హీరో తేజకు ఆంజనేయస్వామి శక్తులు వస్తాయి. ఆ సమయంలో గాలిలో తేలియాడే సన్నివేశాలు ఉంటాయి. అవి ఎంతో కష్టపడి చేసినట్లు హీరో తేజ చెప్పారు.

ALSO READ : 200 రోజుల్లో సొమ్ము రెట్టింపు.. యదేచ్చగా కార్యకలాపాలు..!

సినిమాలో ఈ సన్నివేశం కోసం సుమారుగా 6 గంటల పాటు తాళ్ల సహాయంతో వేలాడినట్లు తేజ పేర్కొన్నారు. ఇక ఈ సినిమా క్లైమాక్స్ కోసం షూటింగ్ 40 రోజులు సాగిందని పేర్కొన్నారు. ఈ క్లైమాక్స్ చిత్రీకరించే సమయంలో ఎక్కువగా దుమ్ము, పొగ వచ్చాయని వాటి వల్ల తన కంటిచూపు పూర్తిగా దెబ్బతిన్నదని తేజ తెలిపారు. కుడి కన్ను అసలు కనిపించడం లేదని చెప్పారు.

వైద్యుల వద్దకు వెళ్తే వెంటనే సర్జరీ చేయాలన్నారని, అయితే తాను సినిమా విడుదలైన తర్వాత సర్జరీ చేయించుకుంటానని వారితో చెప్పినట్లు తేజ పేర్కొన్నారు. హనుమాన్ సినిమా కోసం తేజ ఇంత కష్టపడ్డారా..? ఆయన కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కిందంటూ సోషల్ మీడియాలో చర్చ సాగుతుంది. ఈ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ రాబోతున్న సంగతి తెలిసిందే.

ALSO READ : BREAKING : పండగపూట విషాదం. వేములపల్లి లో రోడ్డు ప్రమాదం, వ్యక్తి దుర్మరణం..!

20 సంవత్సరాల పాటు ప్రతి సంక్రాంతికి ఒక సూపర్ హీరో సినిమాను విడుదల చేస్తానని, తనతో పాటు కొత్త డైరెక్టర్ల సినిమాలు కూడా ఉంటాయని దర్శకుడు ప్రశాంత్ వర్మ తెలిపారు.

మరిన్ని వార్తలు