200 రోజుల్లో సొమ్ము రెట్టింపు.. యదేచ్చగా కార్యకలాపాలు..!

ఆన్‌లైన్‌ నేరాల కట్టడికి పోలీసు యంత్రాంగం విస్తృతంగా ప్రయత్నిస్తున్నా అక్రమాలకు అడ్డుకట్ట పడటం లేదు. అధిక రాబడుల ఆశతో ఆన్‌లైన్‌లో పెట్టుబడులు పెడితే చివరికి అసలు సొమ్ముకే ఎసరు వచ్చిన ఘటనలు బోలెడు. ప్రజల నమ్మకాన్ని పెట్టుబడిగా చేసుకుని ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంగా పురుడు పోసుకున్న ఓ ముఠా యథేచ్ఛగా కార్యకలాపాలు సాగిస్తోంది.

200 రోజుల్లో సొమ్ము రెట్టింపు.. యదేచ్చగా కార్యకలాపాలు..!

నెలకొండపల్లి, మన సాక్షి :

ఆన్‌లైన్‌ నేరాల కట్టడికి పోలీసు యంత్రాంగం విస్తృతంగా ప్రయత్నిస్తున్నా అక్రమాలకు అడ్డుకట్ట పడటం లేదు. అధిక రాబడుల ఆశతో ఆన్‌లైన్‌లో పెట్టుబడులు పెడితే చివరికి అసలు సొమ్ముకే ఎసరు వచ్చిన ఘటనలు బోలెడు. ప్రజల నమ్మకాన్ని పెట్టుబడిగా చేసుకుని ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంగా పురుడు పోసుకున్న ఓ ముఠా యథేచ్ఛగా కార్యకలాపాలు సాగిస్తోంది.

నేలకొండపల్లి మండలం మంగాపురంతండాకు చెందిన వ్యక్తి స్థానికంగా ఓ ఆన్‌లైన్‌ స్టోర్‌ను ప్రారంభించాడు. కస్టమర్ల నమ్మకాన్ని చూరగొని గతేడాది జూన్‌లో ఓ వెబ్‌సైట్‌ నెలకొల్పి అధిక రాబడి ప్రకటనలిచ్చాడు. నేలకొండపల్లికి చెందిన ఓ హోటల్‌ నిర్వాహకుడు, మరో ఐదుగురి సహాయంతో బృందాన్ని ఏర్పాటుచేశాడు. తన వెబ్‌సైట్‌లో రూ.5వేలు, రూ.10వేలు, రూ.లక్ష పెట్టుబడి పెడితే 200 రోజుల్లో సొమ్ము రెట్టింపవుతుందని నమ్మబలికాడు. మొదట్లో పెట్టుబడి పెట్టి లాగిన్‌ ఐడీలు తీసుకున్న టీం సభ్యులకు రెట్టింపు సొమ్ము ఇచ్చి వారి సాయంతో మార్కెట్‌లో విస్తృత ప్రచారం పొందారు.

ALSO READ : వైసిపి ఎమ్మెల్యే రెడ్డిశాంతి కి టిక్కట్ పై ఆ పార్టీ నేత వరప్రసాద్ సంచలన కామెంట్..!

ఇందులో భాగంగానే బృంద సభ్యులకు డబ్బు జమచేసినట్టు సమాచారం. లబ్ధి పొందిన అతికొద్దిమంది సభ్యులు కార్లు కొన్నారు. టూర్లు తిరిగారు. సామాజిక మాధ్యమాల్లో ఈ వార్తలు చక్కర్లు కొట్టడంతో చాలామంది నూతనంగా పెట్టుబడి పెట్టి లాగిన్‌ ఐడీలు తీసుకున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్‌ జిల్లాలతోపాటు ఏపీలోని జగ్గయ్యపేట, నందిగామ, కంచికచర్ల, విజయవాడ ప్రాంతాల నుంచి సుమారు రూ.10కోట్ల డిపాజిట్లు సేకరించినట్టు సమాచారం.

గడిచిన ఆరు నెలల్లోనే కంపెనీ రూ.8 కోట్ల టర్నోవర్‌ చేసిందని కొత్త కస్టమర్లకు వివరిస్తూ ఆశలు కల్పిస్తున్నారు. నేలకొండపల్లిలో తరచూ కార్యాలయాలు మారుస్తూ వెబ్‌సైట్‌లో బెంగళూరుకు చెందిన చిరునామా పేర్కొంటున్నారు.

ALSO READ : తెలంగాణలో రైతులకు ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ.. ఆ తేదీ లోపు తీసుకున్న వారికే..!

మోసగించేది ఇలా : 

కస్టమర్లకు 200 రోజుల్లో సొమ్ము రెట్టింపని చెప్పి చేర్చుకుంటున్నారు. ఉదాహరణకు రూ.5వేలతో ఒకరు లాగిన్‌ అయితే వారి పెట్టుబడి రూ.5వేలను విత్‌డ్రా అవకాశం లేకుండా హోల్డ్‌ చేస్తున్నారు. దానిపై రోజువారీ కమిషన్‌ను వాలెట్‌లో జమచేస్తున్నారు. వాస్తవమేంటంటే పెట్టుబడి పెట్టిన రూ.5వేలనే రోజూ కొంతమొత్తంగా జమచేస్తున్నారు తప్ప అసలు రెట్టింపు మాటే లేదు. గడువు ముగిసినవారు అసలు సొమ్ము అడిగితే ఏరోజు లాభం ఆరోజు పడుతుంది కదా.. అసలు సొమ్మును విత్‌డ్రా చేసుకోవద్దని నచ్చచెబుతున్నారు.

నమ్మబలుకుతున్నారు. సుమారు 600 మంది ఇప్పటికే చేరారు. బాహాటంగానే టీంల ఏర్పాటు, వేడుకలు నిర్వహస్తుండటంతో త్వరగా ప్రజలు ఆకర్షితులవుతున్నారు.

నకిలీ రసీదులు : 

పెట్టుబడి పెట్టిన వారికి నేలకొండపల్లి కేంద్రంగా అదే కంపెనీ పేరుతో ఓ చిట్‌ఫండ్‌ నిర్వహిస్తున్నట్లు ఆన్‌లైన్‌లో తయారుచేసిన నకిలీ రసీదును అంటగడుతున్నారు. కోదాడకు చెందిన వ్యక్తి చేరితే అక్కడి అడ్రస్‌ పేరుతో నకిలీ రసీదు ఇస్తున్నారు. ఆన్‌లైన్‌లో అధిక రాబడులు పేరుతో డిపాజిట్ల సేకరణే మోసం. దీనికి అనుమతి లేని చిట్‌ఫండ్‌ పేరుతో రసీదులు ఇవ్వటం మరో మోసం. సదరు వ్యక్తులు నేలకొండపల్లిలో పలుచోట్ల నిర్వహించిన కార్యాలయాల్లో ఎక్కడా కంపెనీ వివరాలు లేకుండా జాగ్రత్తపడ్డారు.

ALSO READ : BREAKING : ప్రేమించి పెళ్లి చేసుకుని.. జల్సాలకు అలవాటు పడి, చివరికి ఇలా..!

అసలు సొమ్ము వస్తుందా రాదా అని కొందరు సందేహం వ్యక్తం చేస్తుండటంతో పోలీసులూ ఈవ్యవహారంపై ఆరా తీసినట్లు సమాచారం. సైబర్‌ పోలీసులు వెంటనే స్పందించి వెబ్‌సైట్‌, బ్యాంకు ఖాతాలు స్తంభింపజేసి, నిర్వాహకులను అదుపులోకి తీసుకుంటే మరింతమంది మోసపోయే అవకాశం ఉండదు. గ్రామీణ నేపథ్యం ఉన్నవారికి సాంకేతికత, ఆర్థిక లావాదేవీలపై అంత పట్టుందా లేదా తెరవెనక ముఠాలు ఏవైనా ఉండి నడిపిస్తున్నాయా అనే అంశాన్నీ పోలీసులు తేల్చాల్సి ఉంది.