వైసిపి ఎమ్మెల్యే రెడ్డిశాంతి కి టిక్కట్ పై ఆ పార్టీ నేత వరప్రసాద్ సంచలన కామెంట్..!

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కు వైసీపీ ఎమ్మెల్యే టికెట్ స్థానికులకే ఇవ్వాలని, స్థానికేతురులైన ఎమ్మెల్యే రెడ్డి శాంతికి టిక్కెట్ ఇస్తే ఓడిస్తామని వైసిపి శ్రీకాకుళం జిల్లా కోశాధికారి లోతుగెడ్డ తులసి వరప్రసాద్ అన్నారు.

వైసిపి ఎమ్మెల్యే రెడ్డిశాంతి కి టిక్కట్ పై ఆ పార్టీ నేత వరప్రసాద్ సంచలన కామెంట్..!

మెలియాపుట్టి. మన సాక్షి :

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కు వైసీపీ ఎమ్మెల్యే టికెట్ స్థానికులకే ఇవ్వాలని, స్థానికేతురులైన ఎమ్మెల్యే రెడ్డి శాంతికి టిక్కెట్ ఇస్తే ఓడిస్తామని వైసిపి శ్రీకాకుళం జిల్లా కోశాధికారి లోతుగెడ్డ తులసి వరప్రసాద్ అన్నారు.

పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో కళ్యాణ మండపంలో లోతు గడ్డ తులసి వరప్రసాద్ ఆధ్వర్యంలో నియోజకవర్గ వైసీపీ నాయకులు తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పాతపట్నం నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడి ఉందని స్థానికేతరలు ఎమ్మెల్యేలు అయినందున అభివృద్ధి కుంటుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ALSO READ : BREAKING : ప్రేమించి పెళ్లి చేసుకుని.. జల్సాలకు అలవాటు పడి, చివరికి ఇలా..!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం కావాలని కోరారు. ఈసారి పాత పట్టణం నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ స్థానికేతరులకు ఇస్తే తామంతా వ్యతిరేకిస్తామని అన్నారు. జగన్ అంటే ముద్దు అని ఎమ్మెల్యే రెడ్డి శాంతి వద్దని అన్నారు.

మూడోసారి వైసీపీ గెలవాలంటే స్థానికులకే ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని కోరారు. స్థానికులకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఎమ్మెల్యేను గెలిపించి ముఖ్యమంత్రి జగన్ అన్నకు కానుకగా ఇస్తామన్నారు. స్థానికులకే ఎమ్మెల్యే అభ్యర్థిని కేటాయించాలని కోరుతూ అధిష్టానానికి తీర్మానం పంపిస్తామని అన్నారు.

ఈ సమావేశంలో తూలుగు తిరుపతిరావు, పాతపట్నం జడ్పిటిసి లింగాల ఉషారాణి, మాజీ ఎంపీపీ బమ్మిడి జగన్నాథం, పలువురు వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : BREAKING : చంద్రబాబుతో షర్మిల భేటీ.. అనంతరం కీలక వ్యాఖ్యలు..!