Telangana : ఆరు గ్యారంటీల్లో నాలుగు అమలు చేసాము..!
Telangana : ఆరు గ్యారంటీల్లో నాలుగు అమలు చేసాము..!
- రాష్ట్రంలో వందశాతం పోలియో చుక్కలు వేయించాలి..!
- రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి దామోదర్ రాజనర్సింహ
- జోగిపేటలో పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి
అందోలు, మనసాక్షిః
రాష్ట్రంలో వందశాతం చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖా మంత్రి సి.దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఆదివారం జోగిపేటలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పల్స్‌పోలియో కార్యక్రమాన్ని జ్యోగి వెలిగించి ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. పోలియో చుక్కలు వేయించడంలో చిన్నారుల తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయోద్దని మంత్రి అన్నారు.
0–5 సంవత్సరాల వయస్సున్న ప్రతి ఒక్క చిన్నారులకు తప్పకుండా పోలీయో చుక్కలను వేయించాలని మంత్రి ఆదేశించారు. ఆరు గ్యారంటీల్లో నాలుగు సంక్షేమ పథకాలను అమలు చేసామని మంత్రి అన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, గ్యాస్ సబ్సిడీ, ఆరోగ్యశ్రీ పదిలక్షలకు పెంపు, గృహజ్యోతి, పథకాలను అమలు చేస్తున్నామన్నారు. 11న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కూడా ప్రారంబించబోతున్నామని అన్నారు. ఇచ్చిన హమీలను తప్పకుండా నెరవేరుస్తామని అన్నారు.
ALSO READ : Telangana : తెలంగాణలో పేదలకు మరో శుభవార్త.. ఇందిరమ్మ ఇండ్లకు ముహూర్తం ఖరారు..!
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో:
జోగిపేట లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పల్స్‌పోలియో కార్యక్రమంలో మంత్రి దామోదర్ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్బంగా లయన్స్‌క్లబ్ సభ్యులను మంత్రి అభినందించారు. జోగిపేట పట్టణంలోని గృహ జ్యోతి లబ్దిదారులకు ఉచిత విద్యుత్ పంపిణీకి సంబంధించి జీరో బిల్లును అందజేశారు. లబ్దిదారులు మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.
అంబులెన్స్ ను ప్రారంభించిన మంత్రి :
జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్‌ను మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రారంభించారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందుబాటులో ఉండాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఆర్ చంద్రశేఖర్, జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ గాయత్రీదేవి, చైల్డ్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ సుధీర, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ సంగారెడ్డి, ఆర్‌బీఎస్‌కే డాక్టర్ శ్రీనాథ్, చైల్డ్,హెల్త్ రాష్ట్ర అధికారి భానుకిరణ్, డబ్ల్యూహెచ్‌ఓ సందీప్‌పాటిల్, డీఐఓ శశాంక్ దేశ్‌పాండే, యునిసెఫ్ కన్సల్టెంట్ రవినాయుడు, ప్రోగ్రాం అసిస్టెంట్ శ్రీధర్,
ALSO READ : Telangana : తెలంగాణలో పేదలకు మరో శుభవార్త.. ఇందిరమ్మ ఇండ్లకు ముహూర్తం ఖరారు..!
ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రమేశ్, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, ఆర్డీఓ పాండు, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, కౌన్సిలర్లు చిట్టిబాబు,సురేందర్‌గౌడ్, డాకూరి శంకర్, రంగ సురేష్, హరికృష్ణగౌడ్, రేఖా ప్రవీణ్‌గౌడ్, దుర్గేష్, కే.నాగరాజు, చందర్ నాయక్, మాజీ ఏఎంసీ చైర్మన్ పద్మనాభరెడ్డి, సొసైటీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, వెస్ చైర్మన్ హన్మాండ్లు, మాజీ ఎంపీటీసీ డీజీ వెంకటేశం, సీడీసీ మాజీ డైరెక్టర్ ఎం.జగన్మొహన్‌రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.
ALSO READ : Telangana : తెలంగాణ మహిళలకు సీఎం రేవంత్ మరో శుభవార్త.. ప్రతినెల రూ.2500 ఎప్పటినుంచంటే..!









