Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESతెలంగాణసంక్షేమం

Telangana : తెలంగాణ మహిళలకు సీఎం రేవంత్ మరో శుభవార్త.. ప్రతినెల రూ.2500 ఎప్పటినుంచంటే..!

Telangana : తెలంగాణ మహిళలకు సీఎం రేవంత్ మరో శుభవార్త.. ప్రతినెల రూ.2500 ఎప్పటినుంచంటే..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

మహాలక్ష్మి పథకంలో భాగంగా పేద మహిళలకు నెలకు ₹2,500 రూపాయల పెన్షన్ అందజేసే పథకంపై కసరత్తు కొనసాగుతుంది. మహిళలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ పథకంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచే సంక్షేమ పథకాల జాతర సాగుతుంది. ముఖ్యంగా ఆరు గ్యారెంటీ హామీలను వంద రోజులలో అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం విధితమే.

ఆయన ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచే హామీల అమలుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంతోపాటు ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలకు పెంపు చేశారు. అదేవిధంగా ఈనెల (మార్చి 1వ తేదీ నుంచి) 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకం తో పాటు 200 యూనిట్ల గృహ విద్యుత్ ఉచితంగా అందజేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జీరో విద్యుత్ బిల్లులు విద్యుత్ అధికారులు అందజేస్తున్నారు.

అదేవిధంగా ప్రజాపాలన కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఆరు గ్యారెంటీ హామీలకు దరఖాస్తులు సేకరించిన విషయం తెలిసిందే. దరఖాస్తుల ఆధారంగా ప్రభుత్వ పథకాలను అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఆరు గ్యారెంటీ హామీలలో ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. దాంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన ప్రజల మనసును గెలుచుకుంది.

ALSO READ : Miryalaguda : గృహజ్యోతి పథకం.. జీరో కరెంటు బిల్లులు ప్రారంభం..!

ఇదిలా ఉండగా ముఖ్యంగా ప్రతి పేద మహిళకు ఆర్థిక భరోసా కల్పించేందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతినెల 2500 రూపాయల పథకాన్ని ఎన్నికల ముందు ప్రకటించారు. ఈ పథకం మహిళల్లో బాగా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఈ పథకం ఎప్పుడు అమలు చేస్తారా..? అని మహిళలు ఎదురుచూస్తున్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి పేద మహిళకు 2500 అందించేందుకుగాను కసరత్తు మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రజా పాలన దరఖాస్తుల ఆధారంగా వీలైనంత త్వరలో లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాగానే ప్రతినెల పేద మహిళలకు ప్రభుత్వం 2500 ను అందజేయనున్నది.

దాంతోపాటు కొత్త రేషన్ కార్డులు జారీ చేయడానికి కూడా ప్రభుత్వం కసరత్తు నిర్వహిస్తోంది. రాష్ర్ట వ్యాప్తంగా ప్రతి పేద కుటుంబానికి కూడా తెల్ల రేషన్ కార్డు ఉండాలనేది సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యం. అందుకుగాను ప్రతి పేద కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు త్వరలో ఇవ్వనున్నారు.

ALSO READ : Big Breaking : బీఆర్ఎస్ చలో మేడిగడ్డలో ఊహించని ఘటన.. ఒక్కసారిగా భయపడ్డ ఎమ్మెల్యేలు..!

మరిన్ని వార్తలు