Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణసంక్షేమంహైదరాబాద్

Telangana : తెలంగాణలో పేదలకు మరో శుభవార్త.. ఇందిరమ్మ ఇండ్లకు ముహూర్తం ఖరారు..!

Telangana : తెలంగాణలో పేదలకు మరో శుభవార్త.. ఇందిరమ్మ ఇండ్లకు ముహూర్తం ఖరారు..!

హైదరాబాద్ , మన సాక్షి :

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల జోరు సాగుతుంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచే పేదలకు సంక్షేమ పథకాల అమలు చేయాలని కృతనిశ్చయంతో ఉన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని చర్యలు చేపట్టారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలకు పెంపు చేపట్టారు.

అదేవిధంగా ఈనెల 1వ తేదీ నుంచి 500 రూపాయలకు వంట గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత గృహ విద్యుత్తు అందిస్తున్నారు. ఇదిలా ఉండగా ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలను వంద రోజుల్లో అమలు చేస్తానని రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం మరో పథకాన్ని వారం రోజుల్లో ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు.

తెలంగాణలో ఇల్లు లేని పేదలు ఉండకూడదనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించనున్నారు. శనివారం సచివాలయంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ,పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తో పాటు సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 11వ తేదీన ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇండ్లు లేని అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని వర్తింపజేయాలని, అందుకు అనుగుణమైన విధివిధానాలు వెంటనే తయారు చేయాలని ఆదేశించారు.

ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇంటి స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి గాను ఐదు లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు, ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు ఐదు లక్షల రూపాయలు అందించనున్నట్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన నిబంధనలన్నీ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

ALSO READ : Bjp First List : బిజెపి ఫస్ట్ లిస్ట్..!

మరిన్ని వార్తలు