Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESతెలంగాణసంక్షేమం

Telangana New Ration Cards Process : కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. జారీ అప్పటి నుంచే..!

Telangana New Ration Cards Process : కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. జారీ అప్పటి నుంచే..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రేషన్ కార్డును తప్పనిసరి చేసింది. ఇటీవల ప్రజా పాలన కార్యక్రమంలో గ్యారెంటీ హామీలకు దరఖాస్తులు స్వీకరించిన అధికారులు రేషన్ కార్డులకు కూడా దరఖాస్తులు స్వీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా 30 లక్షల కొత్త రేషన్ కార్డులు కావాలంటూ దరఖాస్తులు అందాయి.

 

ఇది ఇలా ఉండగా ప్రజా పాలనలో వచ్చిన రేషన్ కార్డులకు దరఖాస్తులు కాకుండా.. ఆన్ లైన్ లో మీ సేవల ద్వారా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకోవాలని అధికార యంత్రాంగం సూచించింది. కాగా దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ముందే ఎన్నికల కోడ్ రావడంతో ప్రస్తుతం కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల ప్రక్రియ కొనసాగడం లేదు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతనే తిరిగి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రభుత్వం చేపట్టే ప్రతి సంక్షేమ పథకానికి కూడా రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో అనేకమంది పేదలకు రేషన్ కార్డులు లేకుండా పోయాయి. గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో రేషన్ కార్డులు జారీ చేయకపోవడం వల్ల అనేక మందికి కార్డులు లేకుండా ఉన్నారు. దాంతో ప్రస్తుత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేయడానికి నిర్ణయం తీసుకుంది. ఇది ఇలా ఉండగా కొత్త రేషన్ కార్డులు జారీకి అర్హతలను అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకుంది.

కొత్త రేషన్ కార్డుల జారీకి అర్హులు ఎవరు..?

తెలంగాణ ప్రభుత్వం జారీ చేసే కొత్త రేషన్ కార్డులకు అర్హతలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేదలు బడుగు బలహీన వర్గాలకు మాత్రమే కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. సొంత ఇల్లు, కారు (నాలుగు చక్రాల వాహనం), ఇన్కమ్ టాక్స్ చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు రేషన్ కార్డుకు అనర్హులు. వ్యవసాయ భూమి కూడా 5 ఎకరాలకు పైగా ఉన్నవారు రేషన్ కార్డుకు అనర్హులు.

క్షేత్రస్థాయి పరిశీలన :

కొత్త రేషన్ కార్డులు కోసం దరఖాస్తు చేసుకున్న అనంతరం అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసిన తర్వాతనే కార్డులను జారీ చేయనున్నారు. ఈ ప్రక్రియ పార్లమెంటు ఎన్నికల తర్వాత ప్రారంభం కానున్నది. ఏది ఏమైనా ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతనే కొత్త రేషన్ కార్డులు తెలంగాణలో జారీ కానున్నాయి.

మరిన్ని వార్తలు