Miryalaguda : మిర్యాలగూడలో వ్యక్తి ఆత్మహత్య…!
Miryalaguda : మిర్యాలగూడలో వ్యక్తి ఆత్మహత్య…!
మిర్యాలగూడ, మన సాక్షి:
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం కొత్తపేట గ్రామం ఎర్ర కాలువ తండాకు చెందిన తేజావత్ నరసింహ ( 35) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ..
గత సంవత్సర కాలం నుండి భార్యతో సంసార విషయంలో గొడవలు అయ్యి పెద్దమనుషుల సమక్షంలో విడి కాగితాలు తీసుకొని విడిగా ఉంటున్నాడు.
తేజావత్ నరసింహ కు తన భార్య పిల్లలకు దూరంగా ఉంటున్నారని మానసికంగా బాధపడుతూ మంగళవారం ఉదయం సుమారు 9 గంటలకు మిర్యాలగూడ మండలం అవంతిపురం గ్రామ శివారులో గల బాలాజీ నగర్ టౌన్ షిప్ లో ఒక చెట్టుకు తాడుతో ఉరివేసుకొని చనిపోయి ఉన్నాడు. ఇట్టి విషయమై అతని తల్లి తేజవతి లాలి పోలీస్ స్టేషన్ నందు దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయుచున్నారు.
ALSO READ :
Telangana : తెలంగాణలో ఇందిరమ్మ కమిటీలు.. రూ. 6 వేల వేతనంతో నియామకం..!









