Congress party : జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట..!
Congress party : జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట..!
అందోలు, మనసాక్షిః
జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి సీ. దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఆదివారం జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి సురేష్ షేట్కార్ కు మద్దతుగా ఆందోల్ నియోజకవర్గం లోని మునిపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సతీష్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తత స్థాయి సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని చాటేలా కార్యకర్తలు సిద్ధం కావాలని మంత్రి పిలుపునిచ్చారు. ఆందోల్ నియోజకవర్గ అభివద్ధికి సుమారు రూ.500 కోట్ల రూపాయలతో అభివద్ధి పనులకు శంకుస్థాపన చేశామన్నారు. సింగూరు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివద్ధి చేస్తున్నామన్నారు.
ALSO READ : Cm Revanth : రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త.. 9వ తేదీ వరకు వారి ఎకౌంట్లకు డబ్బులు..!
హైదరాబాద్ కు సమీపంలో ఉన్న సింగూరు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రాంతంలో రిసార్ట్ ల ఏర్పాటు అనువైన ప్రాంతంగా ఉందన్నారు. మునిపల్లి లోని ఉపముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మహిళా రెసిడెన్షియల్ కళాశాలలో ఏర్పాటు చేశామన్నారు. నియోజకవర్గంలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలను రూపొందించామన్నారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇచ్చిన వాగ్దానాలను, 6 గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం అధికారం చేపట్టిన నాలుగు నెలల్లోనే ఐదు గ్యారంటీలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు.
అలాగే, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతే 5 గ్యారెంటీలను అమలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో వెల్లడించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదవాడి సంక్షేమానికి, అభివద్ధికి పెద్దపీట వేస్తుందన్నారు. ఆందోల్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షేటా భారీ మెజారిటీ లభించేలా కార్యకర్తలు అందరూ సమిష్టిగా కషి చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ కార్యకర్తలను కోరారు.
మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తత స్థాయి సమావేశంలో జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ కుమార్ షేట్కార్, మాజీ జెడ్పిటిసిలు రామ్ రెడ్డి, అసద్ పటేల్, శ్రీశైలం స్వామి, మండల ఎంపీటీసీలు విజయ సుధాకర్ రెడ్డి, శివలీల మల్లన్న, రాధాబాయి బాలకష్ణ జోషి, బి. పాండు, మాజీ సర్పంచులు అంజిరెడ్డి, మజీద్, బి. ప్రభాకర్, శివానంద్, సంగమేశ్వర్, ఎన్. వీరన్న, పి. వీరన్న, వెంకట్రాములు, నారాయణతో పాటు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పి. రాజు పాల్గొన్నారు.
ALSO READ :
WhatsApp : ఇండియాలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయా.. కారణం ఏంటి..?
KTR : నువ్వు కట్టుకుంటావా చీర.. లేదా రాహుల్ గాంధీకి కట్టిస్తావా..?









