WhatsApp : ఇండియాలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయా.. కారణం ఏంటి..?

అతి ఎక్కువ మంది వినియోగించే వాట్స్అప్ ఇప్పుడు ఇండియాను విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంది. అసలు వాట్స్అప్ ఇండియాని విడిచిపెట్టడానికి కారణం ఏమిటి..?

WhatsApp : ఇండియాలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయా.. కారణం ఏంటి..?

మన సాక్షి , వెబ్ డెస్క్ :

భారతదేశంలో అత్యధికంగా నిలుస్తున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాట్సాప్. ప్రతి ఒక్కరు సమాచారాన్ని ఫోటోలను చేరవేసేందుకు ఎక్కువగా వాట్సాప్ ను వినియోగిస్తున్నారు. వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉండేందుకు వాట్స్అప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా 100 దేశాలలో వాట్సాప్ ను వినియోగిస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా 280 కోట్ల మంది వాట్సాప్ వినియోగదారులు ఉండగా, అందులో భారత దేశంలోనే అత్యధికమంది వాట్సాప్ వినియోగదారులు ఉన్నారు. భారతదేశంలో సుమారుగా 50 కోట్ల మంది యాక్టివ్ వినియోగదారులు ఉన్నారు. అయితే అతి ఎక్కువ మంది వినియోగించే వాట్స్అప్ ఇప్పుడు ఇండియాను విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంది. అసలు వాట్స్అప్ ఇండియాని విడిచిపెట్టడానికి కారణం ఏమిటి..?

ఇండియాలో ఎక్కువగా వాట్స్అప్ ఫేస్ బుక్ మొదలైన సోషల్ మీడియాలో మేనేజింగ్ ప్లాట్ ఫారం లో ఎక్కువ సమాచారం షేర్ అవుతుంటుంది. అనేక నేరాలకు సంబంధించిన వీడియోలు, నకిలీ వార్తలను కూడా ప్రసారం చేయవచ్చు. దీన్ని అరికట్టడానికి తప్పుడు, క్రిమినల్ కంటెంట్ అసలు సృష్టికర్తలను కనుగొని ప్రాసిక్యూట్ చేయాలి. అందుకు సంబంధించి 2021లో ఐటీ నిబంధనలు రూపొందించారు. ఈ నిబంధన ప్రకారం సోషల్ మీడియా కంపెనీలు భాగస్వామ్యం చేయబడి సమాచారం మూలాన్ని గుర్తించడానికి చట్టానికి సంస్థలతో సహకరించాలి.

కానీ వాట్సప్ కు సొంత పాలసీ ఉంది. దానికి వినియోగదారులను రక్షించడం వాట్స్అప్ విధానములో ఒకటి. దీని సందేశాలు ఎండ్రకాయ టు ఎండ్ ఎన్క్రిప్ట్ చేయబడ్డాయి.  ఒక వ్యక్తి నుండి మరొకరికి పంపిన సందేశాన్ని మూడవ వ్యక్తి చూడలేరు. అందుకే డేటా చాలా గోప్యంగా ఉంటుంది. ఇప్పుడు సిబీఐ వంటి సంస్థలు దర్యాప్తు చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి వాట్సప్ సందేశాన్ని ట్రేస్ చేయడానికి ప్రయత్నిస్తే అది సాద్యం కాదు.

వాట్సప్ తన వద్ద సమాచారం లేదని చెబుతుంది. వాట్సాప్ ద్వారా ఒకరి నుంచి మరొకరికి వచ్చే సమాచారం వాట్స్అప్ గోప్యంగా ఉంచుతుంది. దీనిని ఇతర వ్యక్తులు చూసే విధంగా ఉండదు. వినియోగదారుల గోప్యతను వాట్సప్ ఉంచుతుంది. కాగా వినియోగదారుల గొప్యత కాకుండా తమకు సహకరించాలని ప్రభుత్వం బలవంతం చేస్తే వాట్స్అప్ ఇండియాను వదిలి వెళ్లి పోతామని, ఎండ్ టు ఎండ్ ఎంక్రిప్షన్ విధానం పై మాత్రం రాజీ పడబోమని వాట్సప్ స్పష్టం చేసింది. ప్రభుత్వం బలవంతం చేస్తే వాట్స్అప్ ఇండియాలో వదిలిపోవడం ఖాయం.

MOST READ : 

World Laughing Day : మే 5 ప్రపంచ నవ్వుల దినోత్సవం.. ఎందుకు, ఎప్పటినుంచి జరుపుకుంటున్నామో తెలుసా..!

Cird : వేసవిలో పెరుగు పుల్లగా అవుతుందా.. తీయగా, గడ్డలా ఉండేలా ఇంట్లోనే చేసుకునేది ఎలాగో తెలుసుకుందాం..!

Cm Revanth : రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త.. 9వ తేదీ వరకు వారి ఎకౌంట్లకు డబ్బులు..!

Watermelons : పుచ్చకాయల్లోకి రంగు ఎలా నింపుతున్నారో తెలిస్తే షాక్.. అందరూ చూడాల్సిందే.. (వీడియో వైరల్)

WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు..!

Climbing Stairs : మీరు ప్రతిరోజు మెట్లు ఎక్కి దిగుతున్నారా..? అయితే ఇది తెలుసుకోవాల్సిందే.. కొత్త అధ్యాయంలో నిజాలు..!

Whatsapp : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. ఇక మీ ఫ్రెండ్స్ స్టేటస్ పెట్టగానే..!