Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewslifestyleTOP STORIESఆరోగ్యంఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

World Laughing Day : మే 5 ప్రపంచ నవ్వుల దినోత్సవం.. ఎందుకు, ఎప్పటినుంచి జరుపుకుంటున్నామో తెలుసా..!

World Laughing Day : మే 5 ప్రపంచ నవ్వుల దినోత్సవం.. ఎందుకు, ఎప్పటినుంచి జరుపుకుంటున్నామో తెలుసా..!

మన సాక్షి, ఖమ్మం:

ఆరోగ్యకరంగా ఉండాలంటే ప్రతి వ్యక్తికి నవ్వు ముఖ్యం. నవ్వుల దినోత్సవం కూడా ఒకటి ఉంటుందని అందరికీ తెలియకపోయినా కొందరికి మాత్రం తెలుసు. అసలు నవ్వుల దినోత్సవం అని ఎందుకంటారు. అది మే 5వ తేదీన ఎందుకు జరుపుకోవాలి. అనేది చాలా మందికి తెలియదు. ప్రపంచ నవ్వుల దినోత్సవం మే 5వ తేదీన ఎందుకు జరుపుకుంటారో ఉందాం.. !

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) 1995 సంవత్సరంలో మే మొదటి ఆదివారాన్ని నవ్వుల దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది . దీనికి ప్రధాన కారణము భారతీయుడైన డాక్టర్ మదన్ కటార్య బొంబాయి ఫిజీషియన్. తను శాస్త్రీయ పరిశోధనలు జరిపి డబ్ల్యూహెచ్ కి సమర్పించిన మొదట వాళ్లు నవ్వుల దినోత్సవాన్ని ప్రకటించడం జరిగింది.

నవ్వుల దినోత్సవం : 

ఆరోగ్యవంతమైన జీవితానికి నవ్వు ఎంతో ఉపయోగపడుతుందని బెంగళూరు లాఫ్టర్ యోగా యూనివర్సిటీ ట్రైనర్ తెలంగాణ యోగా సంఘం అధ్యక్షులు, న్యాయవాది మరికంటి వెంకట్ తెలిపారు. ఆదివారం ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ యోగ సంఘం అధ్యక్షులు మరికంటి వెంకట్, ఖమ్మం బార్ అసోసియేషన్ అధ్యక్షులు నేరెళ్ల శ్రీనివాసరావు, పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొండమీది వెంకట్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాకం శ్యామ్ బాబు ఆద్వర్యంలో ప్రపంచశాంతికై నవ్వుదాం అని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తను బెంగళూరు లాఫ్టర్ యోగ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ స్థాపించి నేటి వరకు ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 200 క్లబ్ లను స్థాపించి దేశ విదేశాల్లో ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు అని తెలిపారు.

ఈనేపథ్యంలోనే ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ నందు ప్రపంచ నవ్వు దినోత్సవం జరుపుకుంటున్నామని ఖమ్మం నగరంలోనే కాకుండా అన్ని ప్రాంతాల్లో 10 నుంచి 15 వరకు లాఫ్టర్ క్లబ్ లు నడుస్తా ఉన్నాయి అన్నారు. ఈ ప్రపంచ నవ్వుల దినోత్సవం పురస్కరించుకొని స్థానిక పెవిలియన్ గ్రౌండ్లో వెంకటన్న నవ్వు – నవుమా ద్వి శతక పద్య మంజరి జీవనానంద యోగ వాచక ముద్రల వైద్య గ్రంథ రాజ పుస్తకం ఆవిష్కరించారు. పుస్తకాలు అందరికీ ఉచితంగానే అందిస్తామని మరికంటి వెంకట్ న్యాయవాది అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎఐటియుసి మున్సిపల్ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మంద వెంకటేశ్వర్లు, పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ట్రెజరర్ పి.సుదర్శన్, రామనాధం, యం.దామోదర్ రెడ్డి, తాల్లూరి వేణు, డాక్టర్ సీతయ్య, లకారం ట్యాంక్ బండ్ వాకర్స్ అసోసియేషన్, అధ్యక్షులు. డి.పూర్ణచందర్, సెక్రటరీ. జనార్దన్, వెంకన్న, ఖాదర్, జ్యోతి, మాధవి, సత్యవతి, కళావతి, సౌజన్య, రజని, సబిత తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : 

Watermelons : పుచ్చకాయల్లోకి రంగు ఎలా నింపుతున్నారో తెలిస్తే షాక్.. అందరూ చూడాల్సిందే.. (వీడియో వైరల్)

Cird : వేసవిలో పెరుగు పుల్లగా అవుతుందా.. తీయగా, గడ్డలా ఉండేలా ఇంట్లోనే చేసుకునేది ఎలాగో తెలుసుకుందాం..!

Cm Revanth : రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త.. 9వ తేదీ వరకు వారి ఎకౌంట్లకు డబ్బులు..!

WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు..!

మరిన్ని వార్తలు