Ap News : జగన్ ఓటమికి అదేనా కారణం.. బాబు రాజకీయ అపరచానిక్యుడిగా మరోసారి రుజువు..!
Ap News : జగన్ ఓటమికి అదేనా కారణం.. బాబు రాజకీయ అపరచానిక్యుడిగా మరోసారి రుజువు..!
మన సాక్షి ,అమరావతి / హైదరాబాద్ :
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్ కు చావు దెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి భారీ మెజారిటీతో అధికారం చేజిక్కించుకోబోతోంది.
గత ఎన్నికల్లో 23 స్థానాలకే పరిమితమైన తెలుగుదేశం పార్టీ కనుమరుగవుతుందని జగన్ చేసిన ప్రచారానికి చంద్రబాబు ఎత్తుగడ పనిచేసింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ కు చావు దెబ్బ తగిలేలా చంద్రబాబు పథకం రూపొందించారు. ఈ ఎన్నికల ద్వారా చంద్రబాబు నాయుడు రాజకీయ అపరచానిక్యుడిగా మరోసారి రుజువు చేసుకున్నారు.
జగన్ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబును అరెస్టు చేయడమే ఆ పార్టీకి నష్టం వాటిలిందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. చంద్రబాబును అరెస్టు చేయడం కేవలం రాజకీయ కుట్రగా భావించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారంతా ఒక్కటయ్యారు. చంద్రబాబుకు మద్దతు పలికారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు వారంతా ఒకటయ్యారని చెప్పవచ్చును. చంద్రబాబు 70 ఏళ్ల వయసులో కూడా రాజకీయ చతురతను ఉపయోగించి అధికారం చేజెక్కించుకున్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబును అరెస్టు చేయడమే కాకుండా సొంత పార్టీ నేతలు, ఆయన అనుచరులు, ఆయనకు దగ్గర మిత్రులు అంతా తప్పుడు సలహాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అధిపతి మెప్పుకోసం గొప్పలు చెప్పిన వారంతా ఫలితాలను చూసి సైలెంట్ అయ్యారు.
చంద్రబాబు అరెస్టు సమయంలో తెలంగాణలోనూ కూడా నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కేటీఆర్, కెసిఆర్ లు కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడిన విషయం అందరికీ తెలిసిందే. నిరసనలు కూడా ఆంధ్రాలో పోయి చేసుకోండి అంటూ ఎగతాళిగా మాట్లాడారు. ఆ విషయాన్ని కూడా టిడిపి తెలంగాణ శ్రేణులు సీరియస్ గా తీసుకున్నట్లు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కనిపించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కెసిఆర్ కు చావు దెబ్బ తగిలింది. పార్లమెంటు ఎన్నికల్లో మరింత దెబ్బ తగిలి పార్టీ లేవలేని పరిస్థితి చేరుకుంది.
చంద్రబాబు అపరచానిక్యం వల్ల ఇటు తెలంగాణలో కేసీఆర్ కు అటు ఆంధ్రాలో జగన్ కు ఒకేసారి షాక్ ఇచ్చారు. ఇక రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో వేచి చూద్దాం..
ALSO READ :









