TG Govt : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. విద్యార్థులకు గుడ్ న్యూస్..!
TG Govt : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. విద్యార్థులకు గుడ్ న్యూస్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ ప్రభుత్వం గత జీవోలను కూడా సవరించి విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్ తెలియజేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు టీచర్లను అందుబాటులో ఉంచేందుకు ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నది.
ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమైంది. విద్యా సంవత్సరం ప్రారంభమైన వెంటనే ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ కూడా ప్రారంభించారు. అయితే ఇది ఎన్నో సంవత్సరాలుగా ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నప్పటికీ గత ప్రభుత్వాలు బదిలీల ప్రక్రియ చేపట్టలేదు.
కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే బదిలీలను మొదలుపెట్టింది.
ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ నేపథ్యంలోనే విద్యార్థులకు కూడా భారీ గుడ్ న్యూస్ తెలియజేసింది. 2015, 2021లో ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను తాజాగా విద్యాశాఖ సవరణలు చేసింది. నాడు జీవో 25 జారీ చేయగా వాటిని సవరించి విద్యార్థులకు మేలు చేసే విధంగా సంచలన నిర్ణయం తీసుకుంది.
గతంలో 19 మంది విద్యార్థులు దాటితేనే ఇద్దరు ఉపాధ్యాయులను కేటాయించేవారు. కాగా ప్రస్తుత విద్యాశాఖ నిర్ణయం ప్రకారం 10 మంది విద్యార్థులకు మించితే ఇద్దరు ఉపాధ్యాయులను ఇవ్వాలని నిర్ణయించింది.
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు 10 మంది ఉంచితే ఇద్దరు ఉపాధ్యాయులను కేటాయించనున్నారు. అదేవిధంగా 41 కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులను కేటాయించనున్నారు. దాంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ALSO READ :
Runamafi : రుణమాఫీ పై సీఎం రేవంత్ రెడ్డి మరో ప్రకటన.. కీలక అప్ డేట్..!
BREAKING: తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.. ధరణి ఫైళ్ల తనిఖీ..!










