Pavan Kalyan: ఏపీ ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా తెలంగాణకు రానున్న పవన్ కళ్యాణ్.. స్వాగత ఏర్పాట్లలో అభిమానులు..!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణకు రానున్నారు. ఆయన ఏపీ ఉప ముఖ్యమంత్రిగా హోదాలో తెలంగాణకు అడుగుపెట్టడం ఇదే తొలిసారి కానున్నది.

Pavan Kalyan: ఏపీ ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా తెలంగాణకు రానున్న పవన్ కళ్యాణ్.. స్వాగత ఏర్పాట్లలో అభిమానులు..!

కూకట్ పల్లి, మన సాక్షి :

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణకు రానున్నారు. ఆయన ఏపీ ఉప ముఖ్యమంత్రిగా హోదాలో తెలంగాణకు అడుగుపెట్టడం ఇదే తొలిసారి కానున్నది. హైదరాబాదులోని కూకట్ పల్లి నియోజకవర్గం పరిధిలోని 5 ఫేస్ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికేందుకు కూకట్ పల్లి జనసేన పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ నియోజకవర్గ ముఖ్య నాయకులతో గురువారం సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటి సారిగా ఈ 29న తెలంగాణ రాష్ట్రంలోని కొండగట్టు అంజన్న సన్నిధిలో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు విచ్చేస్తున్నారు. జనసేన నాయకులు మరియు వీర మహిళలు నియోజకవర్గం నుంచి తరలి వెళ్లి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కొల్లా శంకర్, కాకుమాను లక్ష్మణరావు, వేముల మహేష్ , కలిగినిడి ప్రసాద్, అడబాల షణ్ముఖ, పులగం సుబ్బు , పసుపులేటి ప్రసాద్, ఆకాష్ రెడ్డి, మణికంఠ, వీర మహిళలు అడబాల లక్ష్మీ , శిరీష తదితరులు పాల్గొన్నారు

 

ALSO READ :

Cm Revanth Reddy: నన్ను తప్పించండి.. సోనియా, రాహుల్ గాంధీలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి..!

TGSRTC : ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ సమస్య ఉండదు..!