Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుపెద్దపల్లి జిల్లా

ఎల్లంపల్లి ప్రాజెక్టులో 17.81 టీఎంసీలు, సందర్శించిన జిల్లా కలెక్టర్..!

ఎల్లంపల్లి ప్రాజెక్టులో 17.81 టీఎంసీలు, సందర్శించిన జిల్లా కలెక్టర్..!

పెద్దపల్లి. ధర్మారం, మన సాక్షి ప్రతినిధి :

ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 16,081 క్యూసెక్కుల ఇన్ ఫ్లో
నంది పంప్ హౌస్, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై ద్వారా 16,081 క్యూసెక్కుల ఔట్ ఫ్లో జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 16,081 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, నంది పంప్ హౌస్, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై ద్వారా అదే స్థాయిలో నీటిని పంపిణీ చేస్తున్నామని, ఎల్లంపల్లి ప్రాజెక్టు లో స్థిరంగా 17.81 టీఎంసీల నీటి నిల్వ ఉందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.

సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అంతర్గాం మండలం లోని ఎల్లంపల్లి రిజర్వాయర్ ను సందర్శించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వస్తున్న వరద వివరాలు, ఔట్ ఫ్లో, ప్రాజెక్టులో నీటి నిల్వ తదితర అంశాల ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి కడెం ప్రాజెక్టు నుంచి 8 వేల 203 క్యూసెక్కులు , స్థానిక క్యాచ్ మెంట్ ఏరియా నుంచి 7 వేల 879 క్యూసెక్కులు మొత్తం 16 వెల 081 క్యూసెక్కుల వరద ఇన్ ఫ్లో వస్తుంది.

హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై కు 331 క్యూసెక్కుల నీటిని, నందీప్ పంప్ హౌస్ ద్వారా 15 వేల 750 క్యూసెక్కుల వరదను ఎత్తిపోస్తున్నామని, ప్రాజెక్టులో మొత్తం 17.81 టీఎంసీల నీటి నిల్వ స్థిరంగా ఉందని, ఎల్లంపల్లి రిజర్వాయర్ 62 గేట్లు మూసి ఉన్నాయని తెలిపారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టు దగ్గర అధికారులు 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు వరదను అంచనా వేస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి : 

Srisailam : శ్రీశైలం ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తిన అధికారులు..!

Cm Revanth Reddy : విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి భారీ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా అమలు..!

Nagarjunasagar : నాగార్జునసాగర్ జలాశయానికి కొనసాగుతున్న వరద.. 511 అడుగులకు చేరిన నీటిమట్టం.. Latest Update

మరిన్ని వార్తలు