Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking News

Ration Cards : కొత్త రేషన్ కార్డులపై క్యాబినెట్ కీలక నిర్ణయం.. సబ్ కమిటీ ఏర్పాటు..!

Ration Cards : కొత్త రేషన్ కార్డులపై క్యాబినెట్ కీలక నిర్ణయం.. సబ్ కమిటీ ఏర్పాటు..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పేదలకు రేషన్ కార్డులు అందజేసేందుకు తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం అసెంబ్లీ సమావేశాల అనంతరం క్యాబినెట్ సమావేశం పలు నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు అందజేయాలని నిర్ణయించింది. రేషన్ కార్డుతో పాటు ఆరోగ్యశ్రీ కార్డును కూడా అందజేయాలని కమిటీ నిర్ణయించింది.

కాగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డును అందజేయాలని కమిటీ నిర్ణయించింది. అందుకుగాను రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. సబ్ కమిటీలో పౌరసర పరాల శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.

కమిటీలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి రామోదర రాజనర్సింహ, రెవిన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఉంటారు. సబ్ కమిటీ నిర్ణయం మేరకు రేషన్ కార్డులకు అర్హతలను నిర్ణయిస్తారు. అనంతరం కార్డుల జారీని చేపట్టనున్నారు.

ALSO READ : 

BIG BREAKING : ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ పై సీఎం రేవంత్ సంచలన ప్రకటన..!

District collector : జీవితానికి తొలిమెట్టు అదే, ఆ సమయంలోనే లక్ష్యాన్ని ఎంచుకోవాలి.. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్..!

Nagarjunasagar : నాగార్జునసాగర్ కు భారీ వరద.. 533 అడుగులకు చేరిన నీరు, రేపు ఎడమ కాలువకు నీటి విడుదల..!

మరిన్ని వార్తలు