CEIR : ఫోన్ పోయినా దొరికే టెక్నాలజీ.. సీఈఐఆర్ అంటే ఏంటి.. అది ఎలా పనిచేస్తుందో చూద్దాం..!
CEIR : ఫోన్ పోయినా దొరికే టెక్నాలజీ.. సీఈఐఆర్ అంటే ఏంటి.. అది ఎలా పనిచేస్తుందో చూద్దాం..!
నల్లగొండ, మన సాక్షి :
సిఈఐఆర్ పోర్టల్ ద్వారా నల్లగొండ 2 టౌన్ పరిధిలో గత రెండు నెలలుగా పోగొట్టుకున్న, చోరికి గురైన మొబైల్ ఫోన్లను శనివారం డీఎస్పీ కార్యాలయంలో 50 మంది బాధితులకు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో నల్లగొండ డిఎస్పీ అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పోయిన లేదా దొంగలించబడిన మొబైల్ ఫోన్లను త్వరితగతిన పట్టుకోవడానికి సి ఈ ఐ ఆర్ అనే వెబ్ సైట్ లో సంబంధిత వివరాలను నమోదు చేసుకున్నట్లైతే అలాంటి మొబైల్స్ ను ఈ పోర్టల్ ద్వారా సులభంగా స్వాధీనం చేసుకునే ఆస్కారం ఉంటుంది అని తెలిపారు.
ఈ పోర్టల్ యొక్క ఆవశ్యకతను తెలుపుతూ ప్రజలకు అవగాహన కల్పింస్తున్నమని, ఎవరైతే వినియోగదారులు వారి పోయిన మొబైల్స్ వివరాలను ఈ రిపోర్టర్ లో నమోదు చేసుకోవడం వల్ల సులువుగా గుర్తించడం జరుగుతుంది అని తెలిపారు.
సిఈఐఆర్ ఎలా పనిచేస్తుంది :
కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖా ఆద్వర్యంలో సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ప్రవేశపెట్టింది. ఇందుకోసం. వెబ్ సైట్ లో లాగిన్ కావాలి. అందులో రెక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్ లాస్ట్/స్టోలెన్ మొబైల్ లింక్ కనబడుతుంది.
దానిపై క్లిక్ చేయాలి పోయిన చరవాణి లోని నంబర్లు,ఐఏంఇఐ నంబర్లు, కంపెనీ పేరు, మోడల్, కొన్న బిల్లు అప్లోడ్ చేయాలి. మొబైల్ ఏ రోజు ఎక్కడ పోయింది, రాష్ట్రం, జిల్లా, పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వివరాలు నమోదు చేయాలి.
చివరగా వినియోగదారుడి పేరు, చిరునామా, గుర్తింపు కార్డు, ఈ-మెయిల్ ఐడి, ఓటిపి ఓటిపికోసం మరో చరవాణి నెంబర్ ఇవ్వాలి. ఇదంతా పూర్తయిన తర్వాత ఒక ఐడి నెంబర్ వస్తుంది.
సంబంధిత ఐడి ఫోన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. మొబైల్ ఏ కంపెనీ అయినా సీఈఐఆర్ విధానం ద్వారా ఫోన్ పని చేయకుండా చేస్తుంది. చరవాణి దొరికిన తర్వాత వినియోగదారుడు అదే వెబ్సైట్లోకి వెళ్లి ఆన్ బ్లాక్/ఫౌండ్ మొబైల్ అనే లింక్ పై క్లిక్ చేయాలి.
ఐడి నమోదు చేయగానే ఫోన్ అన్ బ్లాక్ అవుతుంది. చరవాణి పోయిన వెంటనే తమ పరిధిలోని పోలీసులకు సమాచారం అందించారు. సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ఈ సందర్భంగా సాంకేతికను ఉపయోగించి మొబైల్ ఫోన్లను వెతికి పట్టుకొని ఉత్తమ ప్రతిభ కనబరిచి 2 టౌన్ యస్.ఐ నాగరాజు, కానిస్టేబుల్ బాలకోటి, నాగరాజులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ 2 టౌన్ సిఐ డానియల్, యస్. ఐ నాగరాజు, కానిస్టేబుల్ బాలకోటి, నాగరాజు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
Viral : హాజరు వేయాలంటే ముద్దు ఇవ్వాలి.. తోటి ఉపాధ్యాయురాలికి ఉపాధ్యాయుడు వీడియో కాల్.. (Video)
కూలిపోయిన సుంకిశాల ప్రాజెక్టు సైడ్ వాల్ పరిశీలించిన మంత్రులు.. సంఘటన దురదృష్టకరం..!
ఉన్న గదులు కూల్చారు.. కొత్త వాటిని నిర్మించలేదు.. వరండాలో పాఠాలు..!









