కౌలుకు డిమాండ్.. ఆయకట్టులో పెరిగిన కౌలు..!

కౌలుకు డిమాండ్.. ఆయకట్టులో పెరిగిన కౌలు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో కౌలుకు డిమాండ్ పెరిగింది. నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు రెండు పంటలకు నీటిని విడుదల చేశారు. గత ఏడాది సాగర్ ఆయకట్టు పరిధిలో వర్షాభావ పరిస్థితుల కారణంగా పంట పొలాలు బీడుగా మారాయి. కానీ ఈ ఏడాది నీటిని ముందస్తుగానే విడుదల చేయడం వల్ల పంటల సాగుకు రైతులు సిద్ధమయ్యారు.
రైతుల తో పాటు కౌలు రైతులు కూడా సాగు చేయడానికి సిద్ధమయ్యారు. రెండు సీజన్లు కూడా నీటిని విడుదల చేయడం వల్ల కౌలుకు డిమాండ్ పెరిగింది. పంటలు సాగు చేయలేని రైతులు కౌలు రైతులకు కౌలుకు ఇస్తున్నారు. కాగా ఈ ఏడాది కౌలును కొన్నిచోట్ల పోటాపోటీగా పెంచుతున్నారు.
గత ఏడాది వానాకాలం సీజన్ లో ఎకరం భూమికి 12 బస్తాల ధాన్యం, యాసంగి సీజన్ లో 10 బస్తాల ధాన్యం కౌలు ఇచ్చేవారు. కొన్నిచోట్ల వానకాలం సీజన్ లో 13 బస్తాల ధాన్యం వానాకాలం ఇచ్చేవారు.
కానీ ఈ ఏడాది కౌలుకు డిమాండ్ పెరగడంతో వానాకాలం కొన్ని ప్రాంతాలలో 14, 15 బస్తాల ధాన్యం ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. వానాకాలం సీజన్ లో 14,15 బస్తాల ధాన్యం యాసంగి సీజన్ లో 12 బస్తాల ధాన్యం ఇచ్చేందుకు కౌలు రైతులు ఒప్పందం కుదుర్చుకుంటున్నారు.
ALSO READ :
MIRYALAGUDA : మిర్యాలగూడకు కొత్తగా ఒక ఎత్తిపోతల, 3 చెక్ డ్యాములు మంజూరు..!
Ration Cards : రేషన్ కార్డులపై కీలక నిర్ణయం.. వారి రేషన్ కార్డుల తొలగింపు..!
మిర్యాలగూడ : ఎత్తిపోతల పథకాలపై చీఫ్ ఇంజనీర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్..!
భారీ గుడ్ న్యూస్ : ఫోన్ పే, గూగుల్ పే మీకు ఉందా..! ఉంటే తెలుసుకోవాల్సిందే









