Viral video : లంచం డబ్బులు పంచుకున్న ట్రాఫిక్ పోలీసులు.. సిసి టీవీ రికార్డు వైరల్..!
Viral video : లంచం డబ్బులు పంచుకున్న ట్రాఫిక్ పోలీసులు.. సిసి టీవీ రికార్డు వైరల్..!
మన సాక్షి , వెబ్ డెస్క్ :
ముగ్గురు ట్రాఫిక్ పోలీసులు లంచం డబ్బులు పంచుకున్నారు. ఆ సంఘటన సిసిటీవీలో రికార్డు అయిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది ఎక్కడ..? ఏంటి ఆ కథ..? మనం కూడా చూద్దాం..
న్యూఢిల్లీలో ముగ్గురు ట్రాఫిక్ పోలీసులు ఒక వ్యక్తి వద్ద లంచం తీసుకున్నారు. ఆ ముగ్గురు ట్రాఫిక్ పోలీసులు కలిసి పంచుకున్నారు. సిసిటీవీలో రికార్డ్ అయిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అయింది. దాంతో ఆ ముగ్గురు ట్రాఫిక్ పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
శనివారం ఢిల్లీలోని ఘాజీపూర్ లో త్రీ లారీ సర్కిల్లో ఉన్న చెక్ పోస్ట్ పాయింట్ లోపలకు ఒక వ్యక్తిని ట్రాఫిక్ పోలీసులు పిలిచారు. అతడితో కొద్దిసేపు వాదన తర్వాత లంచంగా కొన్ని రూపాయల నోట్లను పోలీసు అధికారి తీసుకున్నాడు.
ఆ తర్వాత ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళగానే ముగ్గురు ట్రాఫిక్ పోలీసులు అక్కడ కూర్చుని తీసుకున్న లంచం డబ్బులను పంచుకున్నారు. అయితే ఆ ప్రాంతంలోని సీసీటీవీలో లంచం డబ్బులు పంచుకునే విషయం రికార్డు అయింది అయింది.
ఆ క్లిప్పు సోషల్ మీడియాలో వేయడంతో వైరల్ అయింది దాంతో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా దాని గురించి ఎక్స్ లో స్పందించారు. ఇద్దరు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఒక హెడ్ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. ముగ్గురు ట్రాఫిక్ పోలీసులపై శాఖపరమైన దర్యాప్తు జరుగుతున్నట్లు ఆయన వెల్లడించారు.
Video :
दिल्ली ट्रैफिक पुलिस अधिकारी का रिश्वत लेते वीडियो वायरल
वीडियो गाजीपुर थाने के पास का बताया जा रहा है@DCPSouthDelhi @dtptraffic @CPDelhi @DelhiPolice @LtGovDelhi @DCPWestDelhi pic.twitter.com/QgROjCo80w
— The National Bulletin Hindi (@BulletinHindi) August 17, 2024
Latest news :
Grama Panchayathi : గ్రామపంచాయతీ ఎన్నికలపై బిగ్ ట్విస్ట్.. మంత్రి పొన్నం వెల్లడి..!
28 నుంచి ఇంటింటి సర్వే.. వారంతా సిద్దంగా ఉండాలి..!
Miryalaguda : మిర్యాలగూడలో ప్లాస్టిక్ కవర్ల విక్రయాల నిషేధం అయినట్టేనా.. ఎమ్మెల్యే ఆదేశాలు గాలికి..!
Runamafi : రుణమాఫీ కాని రైతులకు మరో అవకాశం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!









