District collector : సూర్యాపేట జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. రైతులను ఇబ్బందులు పెట్టిన తహసిల్దార్ బదిలీ, ఇద్దరు రెవెన్యూ ఉద్యోగుల సస్పెండ్..!
District collector : సూర్యాపేట జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. రైతులను ఇబ్బందులు పెట్టిన తహసిల్దార్ బదిలీ, ఇద్దరు రెవెన్యూ ఉద్యోగుల సస్పెండ్..!
సూర్యాపేట, మన సాక్షి :
రైతులను ఇబ్బందులకు గిరిచేసిన సూర్యాపేట జిల్లాలో ఒక తాసిల్దారును బదిలీ చేయడంతో పాటు ఇద్దరు రెవెన్యూ ఉద్యోగులను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హెచ్చరించారు. సూర్యాపేట జిల్లాలోని రైతులను ఇబ్బందులకు గురిచెస్తున్న ఇద్దరు తహసీల్దార్ కార్యాలయ ఉద్యోగులను సస్పెన్షన్ చేస్తూ జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
కోదాడ తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ సాయిరాం, రెవెన్యూ ఇన్స్పెక్టర్ పి. సుజిత్ పై రైతుల నుండి పలు ఆరోపణలు రావడంతో స్పందించిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కోదాడ ఆర్దివో ను విచారణకు ఆదేశించారు. విచారణలో వాస్తవాలు నిజమేనని తేలడంతో కోదాడ తహశీల్దార్ సాయి రాంను బదిలీ చేశారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుజిత్ ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
అదే విదంగా సూర్యాపేట కలెక్టరేట్ కార్యాలయంలో పరిపాలన విభాగంలో డిప్యుటేషన్ పై పని చేస్తున్న నాగారం తహశీల్దార్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ షఫీ ఉద్యోగుల నుండి పలు ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ విచారణలో వాస్తవాలు రుజువు కావడంతో సదురు ఉద్యోగిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ALSO READ :
Runamafi : రుణమాఫీ సమస్యల పరిష్కారానికి మార్గదర్శకాలు ఇవీ..!
Food poison : పండగపూట విషాదం.. ఫుడ్ పాయిజన్ తో అనాధ పాఠశాలలో నలుగురు విద్యార్థులు మృతి..!
Cm Revanth Reddy : బాహుబలి.. ప్రభాస్ ఫై సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్..!









