మిర్యాలగూడ : ఏకంగా లారీనే దాచేశాడు.. ఆ ఘనుడు..!
మిర్యాలగూడ : ఏకంగా లారీనే దాచేశాడు.. ఆ ఘనుడు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
ఏకంగా సొంత లారీని దాచేసి చోరీకి గురైందని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చోటుచేసుకుంది. మిర్యాలగూడ సిఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం..
మాడుగుల పల్లి మండలం ధర్మపురం గ్రామానికి చెందిన బండారపు నాగార్జున ఐదు సంవత్సరాల క్రితం ఒక ఫైనాన్స్ సంస్థ నుంచి 13 లక్షల రూపాయల తీసుకొని లారీని కొనుగోలు చేశాడు.
అతడు ప్రతినెలా 54 వేల రూపాయలను ఈఎంఐ చెల్లిస్తున్నాడు. ఇది ఇలా ఉండగా తన లారీ చోరీకి గురైందని నమ్మిస్తే ఫైనాన్స్ ఎగ్గొట్టొచ్చని పథకం వేశాడు. 2024 మే 22వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం నుంచి 12 లక్షల రూపాయల విలువైన ఐరన్ స్క్రాప్ లోడుతో మహారాష్ట్రకు లారీ బయలుదేరింది.
కాగా మిర్యాలగూడలో తాను నివాసం ఉంటున్న దుర్గానగర్ కు తీసుకొచ్చాడు. రెండు రోజుల తర్వాత నల్గొండ జిల్లా కనగల్ మండలం చిన్న మాదారం గ్రామానికి చెందిన తన అల్లుడు బొడ్డుపల్లి అనిల్ కు చెందిన బత్తాయి తోటలో లారీని దాచి పెట్టాడు.
మే 28వ తేదీన తన లారీ చోరీకి గురైందని మిర్యాలగూడ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా కనగల్ మండలం చిన్న మాదారం బత్తాయి తోటలో నాగార్జునే లారీని దాచిపెట్టినట్లు తెలుసుకున్నారు. తోటలో లారీని గుర్తించారు.
ఫైనాన్స్ సంస్థను, పోలీసులను పక్కదారి పట్టించేలా వ్యవహరించిన బండారపు నాగార్జున పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. లారీ తో పాటు 12 లక్షల విలువైన ఐరన్ స్క్రాప్, లారీ పత్రాలు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎస్సై, ఏ ఎస్ ఐ గఫార్, రాముల నాయక్ పాల్గొన్నారు.
LATEST UPDATE :
మిర్యాలగూడ : ప్రాధాన్యత లేదని కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం.. పరామర్శించిన ఎమ్మెల్యే..!
మిర్యాలగూడ : కనిపించని ప్లాస్టిక్ కవర్స్ నిషేధం.. విక్రయధారులతో ఎమ్మెల్యే..!










