Nelakondapally : నేలకొండపల్లిలో తెల్ల త్రాచు కలకలం..!
Nelakondapally : నేలకొండపల్లిలో తెల్ల త్రాచు కలకలం..!
నేలకొండపల్లి, మన సాక్షి :
ఓ ఇంట్లో తెల్ల త్రాచు పాము చోరబడి కలకలం సృష్టించింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లిలో చోటుచేసుకుంది.
స్థానికుల కధనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నేలకొండపల్లి మండలం లోని మంగాపురంతండా లో బ్రిడ్జి దగ్గర మర్రి చెట్టు సమీపంలో ఉన్న హేమ్లా-చంద్రావతి నివాసం లోకి శుక్రవారం తెల్ల త్రాచు పాము చోరబడింది. జ్వరంతో బాధపడుతున్న చంద్రావతి ఇంట్లో వేరే గదిలో నిద్రిస్తుంది. అదే సమయంలో పాము ఇంట్లో వంట గదిలో చోరబడింది.
కాగా వంట ఇంట్లో ఉన్న సామన్లు కింద పడటంతో కోతులు అనుకుని ఆగది లోకి చంద్రావతి పరిశీలించింది. రెప్పపాటు పాము కాటు నుంచి తప్పించుకుంది. దీంతో ఆమె పాము అని భయంతో కేకలు వేయటంతో స్థానికులు వచ్చి తెల్ల త్రాచుపాము ను చంపేశారు. శుక్రవారం కావటంతో పాము ను రూపాయి నాణెంతో కాల్చివేశారు. అరుదుగా కనిపించే తెల్లత్రాచు పాము కావటంతో సానికులు పెద్ద ఎతున వచ్చి తిలకించారు.
LATEST UPDATE :
నిరుద్యోగులకు శుభవార్త.. 2280 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్..!
Runamafi : కుటుంబ నిర్ధారణ సరే.. వారికి రుణమాఫీ ఎప్పుడంటే..!
Elections : తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు అప్పుడే.. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి..!
Runamafi : రూ. 2 లక్షలకు పైగా రుణం ఉందా.. రుణమాఫీ కాని రైతులకు గుడ్ న్యూస్..!
ఫ్లాష్ న్యూస్ : సెల్ఫీ దిగుతూ సాగర్ ఎడమ కాలువలో పడిన మహిళ.. కాపాడిన స్థానికులు..!









