TG News : తెలంగాణలో వర్షాలు.. పాఠశాలలకు సెలవు..!
TG News : తెలంగాణలో వర్షాలు.. పాఠశాలలకు సెలవు..!
హైదరాబాద్, మన సాక్షి :
తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు, వరదల కారణంగా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లకు తెలంగాణ సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
వర్షాలు, వరదలపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు. వర్షాలు ఎక్కువగా కురిసే జిల్లాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని, కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదే విధంగా పాఠశాలలకు సెలవులు ఇచ్చే విషయంపై ఆయా జిల్లాల్లో పరిస్థితులను బట్టి జిల్లా కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
చెరువులు, కుంటలు, వాగుల చోట అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో నీటిపారుదల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆమె ఆదేశాలు జారీ చేశారు. వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలలో నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు సచివాలయంకు తెలియజేయాలని ఆదేశించారు.
LATEST UPDATE :
Alert : తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. మూడు రోజులు వర్షాలే..!
Nalgonda : వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి, అవి చేయొద్దు.. జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి..!
Panchayathi Elections : మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు.. బ్యాలెట్ తోనే నిర్వహణ..!
Rythu Barosa : రైతు భరోసా యాప్ తో రుణమాఫీ సమస్యలకు చెక్..!
నిరుద్యోగులకు శుభవార్త.. 2280 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్..!









