Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsఉద్యోగంజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి, అవి చేయొద్దు.. జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి..!

Nalgonda : వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి, అవి చేయొద్దు.. జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి..!

నల్లగొండ, మన సాక్షి :

నల్గొండ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి కోరారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అవసరమైనచోట సహాయ సహకారాలు అందించాలన్నారు.

మరో రెండు రోజులపాటు వర్షాలు కురియనున్న దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.మట్టి మిద్దెలు , కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న ఇండ్లలో ఎవరు నివాసం ఉండొద్దన్నారు.

నాగార్జునసాగర్ ప్రాజెక్టు, మూసి ప్రాజెక్టుల గేట్లు తెరిచినందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,ప్రాజెక్టు పరివాహక ప్రాంతాలు, నది పరివాహక ప్రాంతాలలో నీటిలోకి ఎవరు వెళ్లొద్దని తెలిపారు.ఈత కొట్టేందుకు యువత నదులు ప్రాజెక్టుల వద్ద నీటిలోకి మత్స్యకారులు చేపలు పట్టేందుకు నీళ్లలోకి వెళ్లవద్దన్నారు.

వర్షం కారణంగా విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల కు షార్ట్ సర్క్యూట్ వచ్చేందుకు అవకాశం ఉన్నందున వాటికి దగ్గరగా మనుషులు, పశువులు వెళ్లొద్దని, విద్యుత్ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి ఆదేశించారు.

విద్యుత్ అధికారులు ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉన్న వాటిని గుర్తించి ముందే తొలగించాలి, వర్షం , గాలుల కారణంగా ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపోయిన, స్తంభాలు ఒరిగిపోయిన తక్షణమే సరి చేయాలన్నారు. మున్సిపల్ ప్రాంతాలు, గ్రామాలలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలని, ఎక్కడైనా నీరు నిలువ ఉంటే తక్షణమే నీరు నిలువ లేకుండా చర్యలు తీసుకోవాలి ఆదేశించారు.

మున్సిపాలిటీలు ,గ్రామాలలో పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాలని,కల్వర్టులు, రోడ్లు పొంగిపొర్లుతున్నట్లయితే వాటిని దాటే సాహసం ఎవరు చెయ్యొద్దన్నారు.

ఆర్ అండ్ బి ,పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు అలాంటి ప్రదేశాలలో తక్షణమే హెచ్చరిక బోర్డులు,బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు.మోటార్ బైకులు వాహన దారులు పొంగి పొర్లి ప్రవహించే కల్వర్టులు, వాగులను దాటే సాహసం చేయవద్దని,వర్షం వల్ల రోడ్లపై చెట్లు విరిగిపడినట్లయితే తక్షణమే తొలగించాలన్నారు.

నీటిపారుదల, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు వర్షాల కారణంగా చెరువులు ,కుంటలు ఎక్కడైనా నిండి తెగిపోయేందుకు ఆస్కారం ఉన్నచోట తక్షణమే వాటిని గుర్తించి రక్షణ చర్యలు చేపట్టాలి ఆదేశించారు.

వర్షం వల్ల రైతులు పంటలు నష్టపోకుండా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సరైన సూచనలు, సలహాలు ఇవ్వాలని సూచించారు.వర్షాల కారణంగా సీజనల్ వ్యాధుల బారిన పడిన ప్రజలకు తక్షణ చికిత్స అందించేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని,అవసరమైన మందులు, మెడికల్ కిట్లు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.

రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండి అవసరమైనచోట సహాయక చర్యలను చేపట్టాలని,జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులు అందరూ జిల్లా యంత్రంగానికి అందుబాటులో ఉండాలన్నారు.

LATEST UPDATE : 

TG NEWS : తెలంగాణ కాంగ్రెసులో కోల్డ్ వార్..? ఉత్తమ్ సీఎం అవుతారంటూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు..!

రేవంత్, బట్టి విక్రమార్క, ఉత్తమ్ భేటీ.. కీలక నిర్ణయం..!

Elections : తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు అప్పుడే.. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి..!

Runamafi : రుణ మాఫీ కోసం రేషన్ కార్డులేని రైతులు దరఖాస్తు చేసుకోవాలి..!

మరిన్ని వార్తలు