గంజాయి రవాణా ముఠా అరెస్ట్, రిమాండ్..!
గంజాయి రవాణా ముఠా అరెస్ట్, రిమాండ్..!
కనగల్, మన సాక్షి:
గంజాయి తరలిస్తున్న నలుగురిని ఆరెస్టు చేసి శనివారం రిమాండ్ తరలించినట్లు చండూరు ఇంచార్జ్ సిఐ కే. నాగరాజు తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం…
నల్లగొండలోని పాతబస్తీకి చెందిన వెల్డర్ ఎండి షోయబ్, నల్లగొండలోని ఓల్డ్ సిటి అక్కచల్మకు చెందిన పాన్ కీపర్ ఎండి ఇమ్రాన్ పాషా, నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లికి చెందిన డీసీఎం డ్రైవర్ గంటెకంపు దుర్గాప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాచర్లకు చెందిన మెడికల్ షాప్ వర్కర్ శీలం వెంకట త్రిపుర అభినయ్ లు మాచర్ల నుండి నల్లగొండకు గంజాయి రవాణా చేస్తున్నారు.
కనగల్ మండల పరిధిలోని తేలకంటిగూడెం టోల్ ప్లాజా సమీపంలోని చెట్లల్లో గంజాయిని పంచుకుంటున్న క్రమంలో… నమ్మదగిన సమాచారంతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నల్లగొండ డి.ఎస్.పి శివరాం రెడ్డి పర్యవేక్షణలో ఇన్చార్జి సీఐ ఆధ్వర్యంలో రెడ్ హ్యాండెడ్ గా నలుగురిని పట్టుకున్నట్లు తెలిపారు.
వారి వద్ద నుంచి 140 గ్రాముల గంజాయి, 25 షీట్స్ మత్తు టాబ్లెట్లు, సెల్ ఫోన్లు 4, స్ప్లెండర్ ప్లస్ బైక్ ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. గత రెండు నెలల నుంచి గంజాయిని వాడుతున్నామని మత్తు టాబ్లెట్లను శీలం అభినయ్ దగ్గర మాచర్లలో కొనుగోలు చేశామని, మాచర్లలోనే గుర్తుతెలియని వ్యక్తి నుంచి గంజాయిని కొనుగోలు చేసినట్లు నిందితులు పేర్కొన్నట్లు వివరించారు.
నలుగురు నిందితులపై కేసు నమోదు చేసిన రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. గంజాయి సేవించినా, విక్రయించినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
మిషన్ పరివర్తన్ లో భాగంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో మాదకద్రవ్యాల నిరోధం కోసం పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. 87126 70266 నంబర్ కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. గంజాయి తదితర మత్తు పదార్థాలకు బానిసలై జీవితాన్ని నాశనం చేసుకోవద్దని కోరారు.
ఈ కార్యక్రమంలో కనగల్ ఎస్సై పి. విష్ణుమూర్తి, రైటర్ లు రమేష్, సురేష్, సిబ్బంది వెంకన్న, వీరయ్య, దస్తగిరి, స్వామి, వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
LATEST UPDATE :
Nalgonda : రాయితో కొట్టి, గొంతు నులిమి భర్తను హత్య చేసిన భార్య..!
రేవంత్, బట్టి విక్రమార్క, ఉత్తమ్ భేటీ.. కీలక నిర్ణయం..!
నిరుద్యోగులకు శుభవార్త.. 2280 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్..!
Panchayathi Elections : మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు.. బ్యాలెట్ తోనే నిర్వహణ..!
Runamafi : రుణ మాఫీ కోసం రేషన్ కార్డులేని రైతులు దరఖాస్తు చేసుకోవాలి..!









