Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda: మిర్యాలగూడలో కుండపోత వర్షం.. రోడ్లన్నీ జలమయం, విద్యుత్ లేక కమ్ముకున్న చీకట్లు..!

Miryalaguda: మిర్యాలగూడలో కుండపోత వర్షం.. రోడ్లన్నీ జలమయం, విద్యుత్ లేక కమ్ముకున్న చీకట్లు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కుండపోత వర్షం కురుస్తోంది. శనివారం తెల్లవారుజాము నుంచి మొదలైన వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. శనివారం రాత్రి భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.

ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో మిర్యాలగూడ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలలో ఇండ్లలోకి నీరు చేరింది. మిర్యాలగూడ పట్టణంలోని సుందరయ్య నగర్, బంగారుగడ్డ, సీతారాంపురం, తాళ్లగడ్డ పలు కాలనీలలో ఇళ్లలోకి నీరు చేరింది.

పట్టణంలో పాటు పరిసర గ్రామాలలో విద్యుత్ లేక చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. మిర్యాలగూడ పట్టణంతో పాటు పరిసర గ్రామీణ ప్రాంతాల్లో సైతం భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ నిండిపోయాయి. విద్యుత్ లేక చిమ్మ చీకట్లు కమ్ముకొని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

LATEST UPDATE : 

TG News : తెలంగాణలో వర్షాలు.. పాఠశాలలకు సెలవు..!

TG NEWS : తెలంగాణ కాంగ్రెసులో కోల్డ్ వార్..? ఉత్తమ్ సీఎం అవుతారంటూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు..!

Alert : తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. మూడు రోజులు వర్షాలే..!

TG News : తెలంగాణలో వర్షాలు.. పాఠశాలలకు సెలవు..!

మరిన్ని వార్తలు