తెలంగాణBreaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలు

వాగులో కొట్టుకుపోయిన కారు.. కనిపించకుండా పోయిన తండ్రి, కూతురు..!

వాగులో కొట్టుకుపోయిన కారు.. కనిపించకుండా పోయిన తండ్రి, కూతురు..!

మన సాక్షి :

వరద ప్రవాహంలో కారుతో సహా తండ్రి కూతురు కొట్టుకుపోయినట్లు సమాచారం. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గెట్ కారేపల్లి గంగారం తండా కు చెందిన తండ్రి కూతురు కారులో హైదరాబాదులోని విమానాశ్రయానికి బయలుదేరారు.

మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం ఆకేరు వాగు ఉదృతంగా ప్రవహించడంతో కారు అదుపుతప్పినీటిలో కొట్టుకుపోయింది. అయితే తమ కారు వాగులో కొట్టుకుపోయిందని, వారి మెడ వరకు వారికి నీరు వచ్చిందని తండ్రి, కూతురు తమ బంధువులకు ఫోన్లు చేసి తెలియజేశారు.

కానీ కొద్దిసేపటికి వారి ఫోన్లు కూడా కలవకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా కారు తో సహా వారు కూడా గల్లంతయాలని తెలుస్తుంది. కనికుండా పోయిన వారిలో మోతీలాల్, అశ్విని ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

LATEST UPDATE : 

Nalgonda : వర్షాలకు అప్రమత్తంగా ఉండాలి.. అందుబాటులో టోల్ ఫ్రీ నెంబర్.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!

BREAKING : విజయవాడ హైవే బ్లాక్.. మిర్యాలగూడ మీదుగా ట్రాఫిక్ మళ్లింపు..!

Nalgonda : వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి, అవి చేయొద్దు.. జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి..!

మరిన్ని వార్తలు