Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజాతీయంవ్యవసాయం

Success Story : వ్యవసాయాన్నేి నమ్ముకున్నాడు.. ఏడాదికి కోటి సంపాదన..!

Success Story : వ్యవసాయాన్నేి నమ్ముకున్నాడు.. ఏడాదికి కోటి సంపాదన..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

ఆ కుటుంబం తాతల కాలం నాటి నుంచి కూడా వ్యవసాయ కుటుంబం. అతను బాగా చదువుకొని విదేశాలకు వెళ్లాలని కోరిక.. కానీ చివరికి వారి తాతల లాగానే వ్యవసాయాన్ని నమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా ఏడాదికి కోటి రూపాయలు సంపాదిస్తూ వ్యవసాయంలో గొప్ప విజయం సాధించాడు ఆ రైతు.

వివరాల ప్రకారం.. పంజాబ్ లోని కపూర్తలాలోని పరమజిత్ పురా గ్రామానికి చెందిన రైతు భూమన్ సింగ్ గౌరా.. వారి కుటుంబం వ్యవసాయ కుటుంబం. ఆరుగురి తోబుట్టువులలో భూమన్ సింగ్ చిన్నవాడు. బిఏ రెండు సంవత్సరాలు చదివి ఫీజు కట్టలేని పరిస్థితుల్లో చదువు ఆపేయాల్సి వచ్చింది.

అప్పటి నుంచి తన కుటుంబంతో కలిసి వరి, గోధుమ పొలాల్లో పనిచేసేవాడు. ఆ సమయంలోనే అతనికి ఒక మంచి ఆలోచన తట్టింది. క్యారెట్ సాగు చేయాలని ఆసక్తి కలిగింది. కపూర్తలా జిల్లాలోని పరమజిత్ పురా క్యారెట్ సాగుకు ప్రసిద్ధి. అందుకే తాను కూడా క్యారెట్ సాగులో మంచి విజయం సాధించాలని భావించాడు.

ముందుగా కొద్దిపాటి భూమిలో కూరగాయల సాగు చేస్తున్న రైతులను కలిశాడు. వారి ద్వారా ఎలాంటి సహకారం అందలేదు. అయినా కూడా భూమన్ క్యారెట్ సాగు చేసి విజయం సొంతం చేసుకున్నాడు.

తనకు 4.5 ఎకరాల భూమి ఉండేది. క్యారెట్ సాగు ప్రారంభించాడు. ఇప్పుడు అదే క్యారెట్ సాగు 80 ఎకరాలకు విస్తరించింది. ఇప్పుడు భూమన్ సింగ్ సాగు చేస్తున్న 80 ఎకరాలలో 37 ఎకరాలు ఆయన సొంతం. మిగతా భూమి కౌలుకు సాగు చేస్తుంటాడు. ప్రస్తుతం ఆ కుటుంబం క్యారెట్ పండించడమే కాకుండా విత్తనాలను సైతం విక్రయిస్తుంది.

బాగా చదువుకొని విదేశాలకు వెళ్లాలనుకున్న భూమన్ క్యారెట్ సాగులో గొప్ప విజయం సాధించాడు. 1993లో క్యారెట్ సాగును ప్రారంభించి గొప్ప విజయం సాధించాడు. క్యారెట్ లో మెలకువలు తెలుసుకున్నాడు. వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించి అక్కడ తనకు అవసరమైన పుస్తకాలను సేకరించి చదువుకొని సాగు చేశాడు. క్యారెట్ విత్తనాలే ప్రస్తుతం కిలో 1000 నుంచి 1500 రూపాయల వరకు విక్రయిస్తున్నారు.

సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు విత్తనాలు వేస్తారు. ఇది కేవలం 90 నుంచి 100 రోజుల కాలంలో కోతకు సిద్ధమవుతుంది. ఒక్క ఎకరానికి 100 నుంచి 110 క్వింటాళ్ల క్యారెట్ దిగబడి సాధిస్తున్నాడు. రైతులు కూడా వాణిజ్య పంటల వైపు మొగ్గితే విజయం సాధించడం ఈజీగా ఉంటుంది అని ఆయన చెప్తుంటాడు.

LATEST UPDATE : 

మహిళలకు శుభవార్త.. వ్యాపార రంగంలో ప్రోత్సాహం, జిల్లా కలెక్టర్ ఆదేశం..!

Viral : ఉపాధ్యాయ దినోత్సవం రోజు టీచరమ్మ డ్యాన్స్.. నేటిజెన్ల కామెంట్స్ చూస్తే.. (వీడియో)

Lion : సీసీ పూటేజీలో సింహం కనిపించింది.. భయాందోళనలో ప్రజలు.. (వీడియో)

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం దరఖాస్తు స్వీకరణ.. 17 వరకు గడువు పెంపు..!

మరిన్ని వార్తలు