Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలురాజకీయంహైదరాబాద్

Harish Rao : కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీ వ్యవహారంపై హరీష్ రావు కీలక ట్వీట్..!

Harish Rao : కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీ వ్యవహారంపై హరీష్ రావు కీలక ట్వీట్..!

హైదరాబాద్, మన సాక్షి :

ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీల వ్యవహారంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీష్ రావు కీలక ట్వీట్ చేశారు. తన ఎక్స్ లో ఈ వ్యవహారంపై ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.

ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేం ప్రజాపాలన, ఇదేం ఇందిరమ్మ రాజ్యం..

మా పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి చేర్చుకోవడంతో పాటు, వారినే ఉసిగొల్పి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై దాడులు చేయించడం దుర్మార్గమైన చర్య.

కాంగ్రెస్ పార్టీ విద్రోహ, వికృత, అప్రజాస్వామిక వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో జరిగిన దాడి ఇది. రేవంత్ రెడ్డి వెంటనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాలి.

రాళ్లు, గుడ్లు, టమాటాలతో మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మంది మార్బలంతో వెళ్లి దాడి చేయడం హేయమైన చర్య.

పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందన్నది సుస్పష్టం. ఇంటి మీదకు వస్తామని ప్రెస్ మీట్ లో ప్రకటించి, అనుచరులతో దాడి చేసినప్పటికీ నిలువరించడంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ తీవ్రంగా విఫలమైంది.

పట్టపగలు ప్రజాప్రతినిధి మీద జరిగిన ఈ దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి.
దాడి చేసిన గాంధీని, అతని అనుచరులను వెంటనే అరెస్టు చేయాలి.
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పూర్తి భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం.

LATEST UPDATE : 

BREAKING : కౌశిక్ రెడ్డి ఇంటిపై కోడిగుడ్లు, టమాటాలతో దాడి..!

BIG BREAKING : కౌశిక్ రెడ్డి ఇంటికి అరికెపూడి.. రాష్ట్రంలో హై టెన్షన్..!

Miryalaguda : వారిది మహోన్నత త్యాగం, పరిహారంతో పాటు ఉద్యోగం.. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క..!

మరిన్ని వార్తలు