Peddapalli : భూ ఆక్రమణలపై కఠిన చర్యలు.. అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల..!
Peddapalli : భూ ఆక్రమణలపై కఠిన చర్యలు.. అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల..!
పెద్దపల్లి, మన సాక్షి ప్రతినిధి :
జిల్లాలోని ప్రభుత్వ భూములు, చెరువు శిఖం భూములలో జరిగిన భూ ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురువారం అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సంభందిత అధికారులతో భూ ఆక్రమణల పై సమీక్షించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్ లాల్ మాట్లాడుతూ, మండలాల వారీగా ప్రభుత్వ భూములు, చెరువు శిఖం భూములు, నాలాల పై జరిగిన ఆక్రమణలను గుర్తించి నివేదిక అందజేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ భూములు, చెరువు శిఖం భూములు, నాలాలను ఆక్రమించి ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణాలను వెంటనే తొలగించాలని, ఇప్పటికే జరిగిన నిర్మాణాలపై నివేదిక రూపొందించి చట్ట ప్రకారం వాటిపై సైతం కఠిన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో మంథని రెవెన్యూ డివిజన్ అధికారి వి.హనుమా నాయక్, మున్సిపల్ కమిషనర్లు, తహసిల్దార్ లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
LATEST UPDATE :
అయ్యా జిల్లా కలెక్టర్ గారూ.. చదువుకోలేము, పాఠశాల బంద్ చేసి వెళ్లిపోయిన విద్యార్థులు..!
Harish Rao : కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీ వ్యవహారంపై హరీష్ రావు కీలక ట్వీట్..!
Runamafi : రుణమాఫీ కానీ వారికి సర్వే అయ్యిందా.. ఐతే ఖాతాలలోకి మాఫీ సొమ్ము..!
మహిళలకు సువర్ణావకాశం.. దరఖాస్తు చేసుకున్న రెండు రోజుల్లో రూ.5 లక్షలు..!









