Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
రాజకీయంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

కాకర్ల నారాయణమ్మ కు ఉత్తమ మహిళా రైతు అవార్డు అందజేసిన కేటీఆర్..!

ప్రజాసేవకే అంకితమైన నారాయణమ్మకు ఉత్తమ మహిళా అవార్డు పొందారు. పాడి పరిశ్రమతో స్వయం ఉపాధి పొందుతూ ప్రజాప్ర తినిధిగా ప్రజలకు ఎన్నో సేవలు చేస్తూ ముందుకు సాగుతున్న నారాయణపేట సింగర్ బేస్ కు చెందిన 3వ వార్డు కౌన్సిలర్ నారాయణ మ్మకు శనివారం హైదరాబా దులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవం కార్య క్రమంలో కాకర్ల నారాయణమ్మకు ఉత్తమ రైతు అవార్డు ను మాజీ మంత్రి బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతులమీదుగా అందజేసి ఘనంగా సన్మానించారు.

కాకర్ల నారాయణమ్మ కు ఉత్తమ మహిళా రైతు అవార్డు అందజేసిన కేటీఆర్..!

నారాయణపేట టౌన్, మనసాక్షి:

ప్రజాసేవకే అంకితమైన నారాయణమ్మకు ఉత్తమ మహిళా అవార్డు పొందారు. పాడి పరిశ్రమతో స్వయం ఉపాధి పొందుతూ ప్రజాప్ర తినిధిగా ప్రజలకు ఎన్నో సేవలు చేస్తూ ముందుకు సాగుతున్న నారాయణపేట సింగర్ బేస్ కు చెందిన 3వ వార్డు కౌన్సిలర్ నారాయణమ్మకు శనివారం హైదరాబా దులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవం కార్య క్రమంలో కాకర్ల నారాయణమ్మకు ఉత్తమ రైతు అవార్డు ను మాజీ మంత్రి బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతులమీదుగా అందజేసి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం ఆమెకు తమ రైతు అవార్డు కూడా పొందడం జరిగిందని గుర్తుచేశారు. ఉత్తమ రైతుగా ఉంటూ తన వార్డులోని పేద ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ అందరి ఆధార అభిమానాలను పొందుతూ మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మూడో వార్డు నుండి టిఆర్ఎస్ పార్టీ నుండి నామినేషన్ వేసి ఘనవి జయం సాధించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.

ALSO READ TG : ఐఐఎం కలకత్తా బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఛైర్మన్ గా తిప్పర్తి వాసి..!

మహిళా దినోత్స వం సందర్భంగా శభాష్ కౌన్సిలర్ కాకర్ల నారాయణమ్మ అంటూ కితాబ్ ఇచ్చారు. 2016 జూన్ నెలలో తమ పురస్కార అవార్డును కాకర్ల నారాయణమ్మ అప్పటి మంత్రి జూపల్లి కృష్ణారావు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా అందుకున్నా రని ఆయన గుర్తు చేశారు. 2008 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉత్త మ మహిళా అవార్డు డాక్టర్ చిన్నారెడ్డి చేతుల మీదుగా కాకర్ల నారాయణమ్మ అవార్డు అందుకున్నారు.

పేదలకు ఆసరాగా కొడుకు పేరు పైన ఒక ట్రస్టు పెట్టి ఆ ట్రస్టు నుండి నిరుపేద మహిళలకు తాళి బొట్లను మెట్టలను అందించి ఆమె ఔన్నత్యాన్ని గుర్తుచే శారు. ఈ ట్రస్ట్ ద్వారా విద్యా ర్థులకు నోటు పుస్తకాలు అందించి వారి ఉజ్వల భవిష్యత్తుకు కూడా బాటలు బాటలు వేస్తూ క్రీడాకారులకు క్రీడా పోటీలు నిర్వహించి తన కొడుకు నాతోనే ఉన్నాడం టూ గెలుపొందిన వారికి బహుమతులను అందించి ఆమె తృప్తి పొందిందారిని అన్నారు.

ఈ మహిళా దినోత్సవం సందర్భంగా కాకర్ల నారాయణమ్మకు ఉత్తమ మహిళగా అవార్డు ఇవ్వడం తమకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ నారాయణమ్మ సేవలను గుర్తిస్తూ రాను న్న కాలంలో ఇలాంటి సేవలు మరిన్ని చేపట్టాలని సూచిం చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సబిత ఇంద్రారెడ్డి ,సత్యవతి రాథోడ్ సునీత లక్ష్మారెడ్డి లతోపాటు మహిళలు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు